IPL 2023 PBKS Vs DC: What Will Change In IPL Points Table If Punjab Kings Beat Delhi Capitals - Sakshi
Sakshi News home page

IPL 2023 PBKS Vs DC: ఢిల్లీతో కీలక సమరం.. పంజాబ్‌ గెలిచిందా..?

Published Wed, May 17 2023 6:14 PM | Last Updated on Wed, May 17 2023 7:00 PM

IPL 2023: If Punjab Beat Delhi What Will The Position In Points Table - Sakshi

PC: IPL Twitter

ప్లే ఆ‍ఫ్స్‌ రేసులో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌తో  ఇవాళ (మే 17) జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తప్పక గెలవాల్సి ఉంటుంది. ఈ గెలుపు సాదాసీదాగా లభించినప్పటికీ, అది పంజాబ్‌ను ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంచలేదు. ఫైనల్‌ ఫోర్‌ రేసులో ఉండాలంటే ఢిల్లీపై పంజాబ్‌ భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఢిల్లీ ఇదివరకే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించడంతో ఆ జట్టుకు గెలుపోటములతో ఒరిగేది ఏమీ ఉండదు.

ఎటొచ్చి సమస్య అంతా పంజాబ్‌కే. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో (8) ఉంది. ఇవాల్టి మ్యాచ్‌లో పంజాబ్‌ భారీ తేడాతో గెలిస్తే పాయింట్ల పట్టికలో ఒ‍క్కసారిగా భారీ జంప్‌ కొడుతుంది. 8వ స్థానం నుంచి ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకుతుంది.

ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న ముంబై 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు కలిగి ఉంది. ఢిల్లీపై పంజాబ్‌ భారీ తేడాతో గెలిస్తే, రన్‌రేట్‌ మెరుగుపర్చుకోవడంతో పాటు 14 పాయింట్లు సాధించి, ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకుంటుంది. ఫైనల్‌ ఫోర్‌కు చేరే జట్ల రేసులో గుజరాత్‌, సీఎస్‌కే, లక్నో ముందుండగా.. నాలుగో బెర్తు అవకాశాలు ఆర్సీబీ తర్వాత పంజాబ్‌కు మెరుగ్గా ఉన్నాయి. ఢిల్లీతో మ్యాచ్‌ కాక పంజాబ్‌ మరో మ్యాచ్‌ కూడా అడనున్న నేపథ్యంలో ధవన్‌ సేనకు ఆర్సీబీతో సమానమైన అవకాశాలు (2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది) ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన ముఖాముఖి పోరు పంజాబ్‌దే ఆధిక్యం కనిపిస్తుంది. ఫేస్‌ టు ఫేస్‌ ఫైట్‌లో ఢిల్లీ 15 గెలిస్తే.. పంజాబ్‌ 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 

చదవండి: నీకు బౌన్సర్లు వేయడం మాత్రమే వచ్చా? నాపై రాహుల్‌ సీరియస్‌ అయ్యాడు: సిరాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement