DC's poor fielding performance leaves Ricky Ponting, Kuldeep Yadav frustrated during clash Vs PBKS - Sakshi
Sakshi News home page

IPL 2023: ఈజీ క్యాచ్‌ డ్రాప్‌.. కోపంతో ఊగిపోయిన కు‍ల్దీప్‌ యాదవ్! వీడియో వైరల్‌

Published Thu, May 18 2023 10:21 AM | Last Updated on Thu, May 18 2023 10:45 AM

DC lackluster fielding performance leaves - Sakshi

PC: IPL

IPL 2023 DC Vs PBKSఐపీఎల్‌-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట విజయం లభించింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన హైస్కోరింగ్‌ థ్రిల్లర్‌లో 15 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపొందినప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం తీవ్ర నిరాశపరిచింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ 8 ఓవర్‌ వేసిన కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో.. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ భారీ షాట్‌కు ప్రయత్నించాడు.

అయితే షాట్‌ సరిగ్గా కనక్ట్‌ కావడంతో బంతి డిప్‌ వికెట్‌ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న అన్రిచ్‌ నోర్జే సునాయాస క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో కుల్దీప్‌ యాదవ్‌ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. నోర్జే వైపు చూస్తూ కుల్దీప్‌ గట్టిగా అరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా 2 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న లివింగ్‌స్టోన్‌ ఏకంగా 94 పరుగులు సాధించాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో యష్‌దుల్‌ కూడా అథర్వ తైడే ఇచ్చిన ఓ ఈజీ క్యాచ్‌ను డ్రాప్‌ చేశాడు. ఈ క్రమంలో డౌగట్‌లో కూర్చుకున్న ఢిల్లీ హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌ సైతం నిరాశచెందాడు.
చదవండిIPL 2023: చాలా బాధగా ఉంది.. అదే మా ఓటమికి కారణం! ప్రతీ సారి ఇంతే: ధావన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement