రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెమీస్ బెర్త్‌లు ఖరారు కాగా.. మరో రెండు బెర్త్‌ల భవితవ్యం రేపటి లోగా తేలిపోనుంది. సౌరాష్ట్రపై గెలిచి తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్‌పై గెలిచి మధ్యప్రదేశ్ సెమీస్‌కు అర్హత సాధించగా.. మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో విదర్భ-కర్ణాటక, ముంబై-బరోడా అమీతుమీ తేల్చుకుంటున్నాయి.
బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ ఆథిక్యం సాధించి పటిష్ట స్థితిలో ఉండగా.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక పోరాడుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 415 పరుగుల లీడ్‌లో ఉండగా.. 371 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కర్ణాటకకు గెలుపు ఛాలెంజ్‌లా మారింది. మరో రోజు ఆట మిగిలుండగా.. కర్ణాటక లక్ష్యానికి ఇంకా 268 పరుగుల దూరంలో ఉంది. కర్ణాటకను గెలిపించేందుకు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పోరాటం చేస్తున్నాడు.
మెరిసిన పృథ్వీ షా..
బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో (సెకెండ్ ఇన్నింగ్స్) హార్దిక్ తామోర్ (114), పృథ్వీ షా (87) సత్తా చాటడంతో ముంబై పటిష్ట స్థితికి చేరింది.
- ముంబై తొలి ఇన్నింగ్స్ 384 (ముషీర్ ఖాన్ 203 నాటౌట్, భార్గవ్ భట్ 7/112)
- బరోడా తొలి ఇన్నింగ్స్ 348 (షశ్వత్ రావత్ (124, సోలంకి 136, షమ్స్ ములానీ 4/121)
- ముంబై సెకెండ్ ఇన్నింగ్స్ 379/9 (హార్దిక్ తామోర్ 114, పృథ్వీ షా 87, భార్గవ్ భట్ 7/142)
- నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 415 పరుగుల ఆధిక్యంలో ఉంది
పోరాడుతున్న మయాంక్..
విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగార్వల్ పోరాటం చేస్తున్నాడు.
- విదర్భ తొలి ఇన్నింగ్స్ 460 (అథర్వ తైడే 109, కావేరప్ప 4/99)
- కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 286 (నికిన్ జోస్ 82, యాశ్ ఠాకూర్ 3/48)
- విదర్భ రెండో ఇన్నింగ్స్ 196 (దృవ్ షోరే 57, కావేరప్ప 6/61)
- కర్ణాటక రెండో ఇన్నింగ్స్ 103/1 (మయాంక్ అగర్వాల్ 61 నాటౌట్, సర్వటే 1/10)
- ఈ మ్యాచ్‌లో కర్ణాటక విజయం సాధించాలంటే మరో 268 పరుగులు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment