రంజీ ట్రోపీ 2022లో భాగంగా కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ వికెట కీపర్ నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ అందుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. 98 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కర్నాటక ఓపెనర్ల రూపంలో వికెట్లను త్వరగానే కోల్పోయింది. 33 పరుగుల వద్ద రవికుమార్ సమ్రాట్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన కర్నాటక.. 12వ ఓవర్‌లో మయాంక్ అగర్వాల్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. సౌరబ్ కుమార్ బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో బ్యాట్ ఎడ్జ్‌ను తాకింది. బంతి గాల్లోకి లేచి కీపర్ ద్రువ్ జురేల్ దిశగా వెళ్లింది.
అయితే బంతి ఎత్తులో ఉండడంతో క్యాచ్ దొరకదని అంతా భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా ద్రువ్ జురేల్ తన గ్లోవ్స్‌ను పైకి లేపడంతో బంతి చేతిలోకి వచ్చింది. తాను క్యాచ్ పట్టానా అని మొదట జురేల్ కూడా సందేహం వ్యక్తం చేశాడు. అలా మయాంక్ 5 ఫోర్లతో 22 పరుగులు చేసి మరోసారి నిరాశపరుస్తూ పెవిలియన్ చేరాడు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి కర్నాటక రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి వంద పరుగులు చేసింది. శ్రీనివాస్ శరత్ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం కర్నాటక 198 పరుగుల లీడ్‌లో ఉంది.
చదవండి: రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్ సెంచరీతో కొత్త చరిత్ర; ఎవరీ సువేద్ పార్కర్
Comments
Please login to add a commentAdd a comment