Shreyas Iyer: శ్రేయస్‌ అయ్యర్‌ రీఎంట్రీ.. | Shreyas Iyer Named in Mumbai squad for Ranji Trophy Semifinal against TN | Sakshi
Sakshi News home page

Shreyas Iyer: రంజీ టోర్నీలో అయ్యర్‌ రీఎంట్రీ.. ముంబై జట్టు ఇదే

Published Wed, Feb 28 2024 1:52 PM | Last Updated on Wed, Feb 28 2024 2:40 PM

Shreyas Iyer Named in Mumbai squad for Ranji Trophy Semifinal against TN - Sakshi

టీమిండియా సహచర సభ్యులతో అయ్యర్‌ (ఫైల్‌ ఫొటో PC- BCCI)

Shreyas Iyer named in Mumbai squad: టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో తిరిగి అడుగుపెట్టనున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆంధ్రతో మ్యాచ్‌లో ఆడిన ఈ ముంబై బ్యాటర్‌.. తాజాగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు తప్పక రంజీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో తమిళనాడుతో సెమీస్‌ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు ఇచ్చినట్లు ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.

ఈ మేరకు అజింక్య రహానే సారథ్యంలోని 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. కాగా ముంబై- తమిళనాడు మధ్య  మార్చి 2 నుంచి రంజీ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆరంభం కానుంది. 

వెన్ను నొప్పి అని చెబితే ఎన్సీఏ మాత్రం అలా
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అయ్యర్‌ పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆడి మొత్తంగా కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో మూడో టెస్టు నుంచి జట్టుకు దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో రంజీ బరిలో దిగాలన్న బీసీసీఐ నిబంధన నుంచి తప్పించుకునేందుకు వెన్నునొప్పిని కారణంగా చూపాడు. అయితే, జాతీయ క్రికెట్‌ అకాడమీ మాత్రం అయ్యర్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌కు తెలిపినట్లు వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ఆడకూడదనే శ్రేయస్‌ అయ్యర్‌ ఇలా చేసి ఉంటాడని.. ఈ నేపథ్యంలో అతడిపై గుర్రుగా ఉన్న బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించే యోచనలో ఉందని వదంతులు వ్యాపించాయి. అయితే, తాజాగా తాను ఫిట్‌గా ఉన్నానంటూ అయ్యర్‌ రంజీల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. 

తమిళనాడుతో సెమీస్‌కు ముంబై జట్టు:
అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, భూపేన్ లాల్వానీ, అమోగ్ భత్కల్, ముషీర్ ఖాన్, ప్రసాద్ పవార్, హార్దిక్ తామోర్, శార్దూల్ ఠాకూర్, షామ్స్ ములానీ, తనూష్ కొటియాన్, ఆదిత్య ధుమాల్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి, రాయ్‌స్టన్‌ డయాస్, ధావల్ కులకర్ణి.

చదవండి: Rohit Sharma: ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా? రోహిత్‌ వ్యాఖ్యలపై టీమిండియా దిగ్గజం స్పందన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement