Bhojpuri star Sapna Gill files police complaint against Prithvi Shaw - Sakshi
Sakshi News home page

Prithvi Shaw: బెయిల్‌పై బయటికి.. వెంటనే పృథ్వీ షాపై కేసు

Published Tue, Feb 21 2023 10:56 AM | Last Updated on Tue, Feb 21 2023 11:44 AM

Bhojpuri Star Sapna Gill Files Police Complaint Against Prithvi Shaw - Sakshi

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవలే దాడి జరిగిన సంగతి తెలిసిందే. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదన్న కారణంతో పృథ్వీ షాపై దాడి చేసిన వారిలో సోషల్‌ మీడియా స్టార్‌ సప్నా గిల్‌ కూడా ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఆమెతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. తాజాగా సప్నా గిల్‌ బెయిల్‌పై బయటకు వచ్చింది. కాగా మిగతా ఎనిమిది మందిని మాత్రం జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

అయితే సప్నా గిల్‌ వచ్చీ రావడంతో పృథ్వీ షాతో పాటు అతని స్నేహితుడు ఆశిష్‌ యాదవ్‌పై రివర్స్‌ కేసు పెట్టడం ఆసక్తి కలిగించింది. పృథ్వీ షానే తమను తొలుత రెచ్చగొట్టినట్టు సప్నా గిల్‌ ఆరోపించింది. తనను అసభ్యంగా తాకాడని, నెట్టాడని.. అందుకే ప్రతిఘటించాల్సి వచ్చిందని సప్నా గిల్‌ తెలిపింది. దీంతో పృథ్వీ షా, సప్నా గిల్‌ల మధ్య వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. 

సప్నాగిల్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15న ఓ క్లబ్‌కు వెళ్లానని, సదరు క్రికెటర్‌ను చూడగానే అతడు మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించిందని ఫిర్యాదులో తెలిపింది. తన స్నేహితుడు శోభిత్ ఠాకూర్ సెల్ఫీ కోసం పృథ్వీషాను సంప్రదించగా వాగ్వాదానికి దిగాడని, అతడు బలవంతంగా తన స్నేహితురాలి ఫోన్‌ను తీసుకుని నేలపై హింసాత్మకంగా విసిరి పాడుచేశాడని ఆరోపించింది. తను క్రికెట్‌ను అంతగా అభిమానించనని, అసలు పృథ్వీషా ఎవరో కూడా తనకు తెలియదని స్పష్టం చేసింది. కావాలనే అతడు, అతడి స్నేహితులు తమపై దాడి చేశారని, నేను వద్దని వారించినప్పటికీ తన మాటలను వినకుండా అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది. ఆ సమయంలో పృథ్వీ తనను అసభ్యంగా తాకాడని, నెట్టాడని తెలిపింది.

మరోవైపు పృథ్వీషా.. తనపై కేసు పెట్టడంపై కూడా సప్నా గిల్‌ స్పందించింది. "నేను 50 వేలు అడిగానని చెబుతున్నారు. ఈ రోజుల్లో 50 వేలు అంటే ఏంత? నేను రెండు రీళ్లు చేసి ఒక్క రోజులో అంత సంపాదించగలను. ఆరోపణ చేయాలంటే కనీసం కొంత స్థాయి అయినా ఉండాలి." అని సప్నా గిల్ తెలిపింది.

చదవండి: టీమిండియా క్రికెటర్‌ పృథ్వీ షాపై దాడి

టీమిండియా క్రికెటర్‌పై దాడి.. నటి అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement