
ఐపీఎల్-2023 సీజన్‌కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ఆయా జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మురంచేశాయి. ఐపీఎల్-16వ సీజన్ మార్చి 31 నుంచి షూరూ కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
ఇక ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షాపై ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది సీజన్‌లో పృథ్వీ షా అద్బుతంగా రాణిస్తాడని రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు.
"ఈ ఏడాది ఐపీఎల్ కోసం పృథ్వీ షా చాలా కష్టపడ్డాడు. అతడు ఎన్సీఏలో మెరుగైన శిక్షణ పొందాడు.పృథ్వీ షా ఇంత ఎనర్జీగా ఉండడం నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అతడు ఇప్పుడు చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. పృథ్వీ షా ఈ ఏడాది సీజన్‌లో సత్తా చాటేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. అతడు అద్భుతమైన ఆటగాడు.
మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే అతడు భిన్నమైన టాలెంట్ కలిగి ఉన్నాడు. అతడు కచ్చితంగా ఈ మెగా టోర్నీలో దుమ్మురేపుతాడు" అని విలేకురుల సమావేశంలో పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా గత ఐదు సీజన్ల నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ షా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2021 సీజన్‌లో పృథ్వీ షా అద్బుతంగా రాణించాడు.
ఈ సీజన్‌లో 31.93 సగటుతో 479 పరుగులు సాధించాడు. కాగా ప్రస్తుతం ఢిల్లీ జట్టులో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పావెల్, రుసో వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఇటువంటి కీలక ఆటగాళ్లు ఉన్నప్పటికీ పాంటింగ్.. పృథ్వీ షా వైపు మెగ్గు చూపడం గమానార్హం.
చదవండి: Glenn Maxwell: గాయంపై అప్‌డేట్! బాంబు పేల్చిన మాక్స్‌వెల్..! అయితే..
Comments
Please login to add a commentAdd a comment