
టీమిండియా యవ ఓపెనర్ పృథ్వీ షా గత కొంతకాలంగా తన గర్ల్‌ఫ్రెండ్ నిధి తపాడియాతో రిలేషిన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే తొలిసారి వీరిద్దిరూ పబ్లిక్‌గా కనిపించారు. ఐఐఎఫ్‌ఏ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పృథ్వీ షా, నిధి సందడి చేశారు. గ్రీన్ కార్పెట్‌పై వీరిద్దరూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
పృథ్వీ షా స్లీవ్‌లెస్ జాకెట్, బ్లాక్ షర్ట్, బ్లాక్ జీన్స్ ధరించగా.. నిధి కూడా బ్లాక్ చీరలో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. ఇక ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన షా కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు.
అతడి ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఈ పేలవ ప్రదర్శనతో భారత టీ20 జట్టులో కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశాలను పృథ్వీ షా కోల్పోయాడనే చెప్పుకోవాలి. అయితే ఏడాది కాలంగా డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం పృథ్వీ టాప్ ఫామ్ లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో అస్సాంపై ఏకంగా 379 రన్స్ చేశాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు.
చదవండి: WTC final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్!
Comments
Please login to add a commentAdd a comment