Shubman Gill And Prithvi Shaw Love Life Secrets Revealed On Valentines Day 2023 - Sakshi
Sakshi News home page

Prithvi Shaw-Shubman Gill: వాలెంటైన్స్‌ డే సాక్షిగా బయటపడ్డ ఇద్దరు స్టార్‌ క్రికెటర్ల సీక్రెట్స్‌

Published Wed, Feb 15 2023 4:53 PM | Last Updated on Wed, Feb 15 2023 5:53 PM

Shubman Gill, Prithvi Shaw Secrets Revealed On Valentines Day 2023 - Sakshi

క్రికెట్‌ ఫాలోవర్స్‌కు 2023 వాలెంటైన్స్‌ డే ప్రత్యేకంగా గుర్తుండిపోనుంది. ఈ రోజు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకోగా.. టీమిండియా నవ యువ సంచలన క్రికెటర్లు శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా పర్సనల్‌ వ్యవహారాలు బయటపడ్డాయి. హార్ధిక్‌.. తన భార్య నటాశాను ఉదయ్‌పూర్‌లో మళ్లీ మనువాడగా.. శుభ్‌మన్‌ గిల్‌.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ గారాలపట్టి సారా టెండూల్కర్‌ల ప్రేమ వ్యవహారం వెలుగుచూసింది.

గిల్‌ వాలెంటైన్స్‌ డే రోజు సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ ఆధారంగా గిల్‌-సారాలు డేటింగ్‌ చేశారు/చేస్తున్నారని అభిమానులు కన్ఫర్మ్‌ చేసుకుంటున్నారు. పృథ్వీ షా విషయానికొస్తే.. పర్సనల్‌ లైఫ్‌ గురించి చాలా జాగ్రత్తలు తీసుకునే ఈ ముంబై కుర్రోడు.. వాలెంటైన్స్‌ డే రోజు తన లవ్‌ లైఫ్‌ను కన్ఫర్మ్‌ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టాడు.

మోడల్‌ కమ్‌ యాక్ట్రెస్‌ అయిన నిధి తపాడియాతో ప్రేమలో ఉన్నట్లు నిర్ధారించిన షా.. తన పోస్ట్‌తో ఫ్యాన్స్‌ ఫ్యూజులు ఎగురగొట్టాడు. ఈ ఫోటోలో షా-నిధి జంట ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఈ ఫోటోనే హాట్‌గా ఉందనుకుంటే.. దీనికి షా పెట్టిన క్యాప్షన్‌ జనాలకు మరింత పిచ్చెకిస్తుంది. హ్యాపీ వాలంటైన్స్‌ డే వైఫీ అంటూ మోటు భాషలో షా పెట్టిన క్యాప్షన్‌ క్షణాల్లో దావణంలా వ్యాపించింది.

దీంతో వెంటనే వాలెంటైన్స్‌ డే పోస్ట్‌ను డిలీట్‌ చేసిన షా.. మరో పోస్ట్‌ చేస్తూ.. ఆ ఫోటో పెట్టింది నేను కాదు, ఎవరో ఎడిట్‌ చేశారు, అసలు నిధి ఎవరో తనకు తెలియదన్నట్లు బిల్డప్‌ ఇచ్చాడు. షా వాలెంటైన్స్‌ డే తతంగం నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. షా నిజంగా పెళ్లి చేసుకున్నాడా.. అసలు ఆ పోస్ట్‌ అతను పెట్టిందేనా.. అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

మొత్తానికి ఆట వల్ల పాపులర్‌ కాలేని షా.. ఎఫైర్‌తో హాట్‌ టాపిక్‌ ఆఫ్‌ ఇండియాగా మారిపోయాడు. కాగా, ఇటీవలికాలంలో దేశవాలీ టోర్నీల్లో పరగుల వరద పారించిన షా.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను ఎంపికయ్యాడు. అయితే అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. వాస్తవానికి షా టీ20ల్లో కాకుండా టెస్ట్‌ల్లో స్థానం దక్కుతుందని అశించాడు. అయితే తలా తోక సెలెక్టర్లు షాను టీ20 జట్టుకు ఎంపిక చేశారు. అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీ చేసి సత్తా చాటిన షా.. ఆ తర్వాత కొన్ని టెస్ట్‌లకే ఫామ్‌ కోల్పోయి ఉద్వాసన గురయ్యాడు.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement