హెలికాప్టర్ షాట్ ఆడిన పృథ్వీ షా
న్యూఢిల్లీ : అండర్-19 ప్రపంచకప్ అందించిన సూపర్ హీరో పృథ్వీషా ఐపీఎల్‌లోను చెలరేగుతున్నాడు. శుక్రవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించి ఢిల్లీ విజయంలో ఈ యువ ఆటగాడు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో పృథ్వీషా.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనిని గుర్తు చేశాడు. ధోని పరిచయం చేసిన హెలికాప్టర్ షాట్‌ను అచ్చం అతనిలానే ఆడుతూ సిక్స్ బాదాడు. ఇక ఈ సిక్స్‌ను ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో సాధించడం విశేషం. ఇది ఢిల్లీ ఇన్నింగ్స్ 9 ఓవర్‌లో చోటుచేసుకోగా.. ఈ హెలికాప్టర్ షాట్‌కు మైదానంలోని అభిమానులంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
38 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన షా.. ఐపీఎల్ చరిత్రలో పిన్నవయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా సంజూ శాంసన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 169 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించగా.. 2013లో ఇదే వయసులో శాంసన్ ఈ ఘనతను అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment