ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు పృథ్వీ షా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో పృథ్వీ షా హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో పిన్నవయసులో హాఫ్ సెంచరీ చేసిన జాబితాలో సంజూ శాంసన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 169 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించగా, శాంసన్ కూడా 18 ఏళ్ల 169 రోజుల వయసులోనే అర్థ శతకం నమోదు చేశాడు. 2013లో శాంసన్ ఈ ఘనత సాధించగా, పృథ్వీ షా ఆడుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు.
ఇక పిన్నవయసులో ఐపీఎల్ హాఫ్ సెంచరీలు సాధించిన వారి జాబితాలో రిషబ్ పంత్(18 ఏళ్ల 212 రోజులు), ఇషాన్ కిషన్(18 ఏళ్ల 299 రోజులు), గోస్వామి(19 ఏళ్ల 1 రోజు), మనీష్ పాండే(19 ఏళ్ల 253 రోజులు)లు వరుస స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment