ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ఆటగాడు కీరోన్ పొలార్డ్ గోల్డెన్ డక్‌గా అవుటయ్యాడు. ఢిల్లీ బౌలర్ డానియల్ క్రిస్టియన్ వేసిన 16 ఓవర్ ఐదో బంతికి క్రీజ్‌లోకి వచ్చిన పొలార్డ్ ఎదుర్కొన్న తొలి బంతితే బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు బంతికి ఇషాన్ కిషన్ అవుట్ కాగా, ఆ మరుసటి బంతికి పొలార్డ్ పెవిలియన్ చేరాడు. క్రిస్టియన్ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని అంచనా వేయడంలో విఫలమైన పొలార్డ్ వికెట్‌ను సమర్పించుకున్నాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు శుభారంభం లభించింది.తొలి వికెట్‌కు ముంబై ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్‌లు 102 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. దాంతో ముంబై తరపున ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన ఓపెనింగ్ జోడిగా గుర్తింపు పొందారు. తొలి వికెట్‌గా లూయిస్(48; 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అవుట్ కాగా, రెండో వికెట్‌గా సూర్యకుమార్ యాదవ్(53;32 బంతుల్లో 7ఫోర్లు 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ ఏడు పరుగుల వ్యవధిలో అవుటయ్యారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్(44; 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. నాల్గో స్థానంలో వచ్చిన రోహిత్ శర్మ(18)మరోసారి నిరాశపరిచాడు.
Comments
Please login to add a commentAdd a comment