
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇక్కడ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భతమైన ఫీల్డింగ్‌తో అదుర్స్ అనిపించాడు. అన్న కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో తమ్ముడు హార్దిక్ పాండ్యా కళ్లు చెదిరే క్యాచ్‌తో అబ్బురపరిచాడు. ఢిల్లీ లక్ష్య ఛేదనలో భాగంగా కృనాల్ వేసిన 14 ఓవర్ రెండో బంతిని మ్యాక్స్‌వెల్ హిట్ చేశాడు. స్కోరును పెంచే క్రమంలో మ్యాక్స్‌వెల్ భారీ షాట్ ఆడగా దాన్ని హార్దిక్ పాండ్యా గాల్లో డైవ్ కొట్టి అందుకున్నాడు.
ఆ క్యాచ్‌ను హార్దిక్ నమ్మశక్యం కాని రీతిలో ఒడిసి పట్టుకోవడంతో స్టేడియం హోరెత్తింది. ఇది ఈ సీజన్ అత్యుత్తమ క్యాచ్‌గా నిలిచింది. ముంబై నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ధాటిగా బ్యాటింగ్ ఆరంభించింది. తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన ఢిల్లీ.. రెండో వికెట్‌కు 69 పరుగుల సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment