
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా బుధవారం ఇక‍్కడ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్.. ముందుగా రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని ఐపీఎల్‌కు దూరమైన రాజస్థాన్ రాయల్స్ రెండేళ్ళ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే చతికిలపడింది. హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో రాయల్స్ జట్టుగా అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది.
మరొకవైపు ఢిల్లీ డేర్‌డెవిల్స్ కూడా ఈ ఐపీఎల్‌ను ఓటమితోనే మొదలుపెట్టింది. మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ గౌతమ్ గంభీర్ మినహా మిగతా ఆటగాళ్లు రాణించలేకపోయారు. మరోవైపు బౌలర్లూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఢిల్లీ తొలి మ్యాచ్‌ను పరాభవంతో ప్రారంభించాల్సి వచ్చింది. దాంతో ఇరు జట్లు గెలిచి బోణీ కొట్టాలని భావిస్తున్నాయి. ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ చేసిన జట్లే గెలిచిన సంగతి తెలిసిందే.
తుది జట్లు
ఢిల్లీ డేర్‌డెవిల్స్
గౌతం గంభీర్(కెప్టెన్), గ్లేన్ మ్యాక్స్‌వెల్, రిషబ్ పంత్, క్రిస్ మోరిస్, శ్రేయాస్ అయ్యర్, ట్రెంట్ బౌల్ట్, కోలిన్ మున్రో, మహ్మద్ షమీ, విజయ్ శంకర్, షాబాజ్ నదీమ్, రాహుల్ తెవాటియా
రాజస్తాన్ రాయల్స్
అజింక్యా రహానే(కెప్టెన్), శ్రేయాస్ గోపాల్, రాహుల్ త్రిపాఠి, జయదేవ్ ఉనాద్కట్, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, బెన్ లాప్లిన్, జోస్ బట్లర్, ధావల్ కులకర్ణి, క్రిష్ణప్పన్ గౌతమ్, డి'ఆర్సీ షార్ట్
Comments
Please login to add a commentAdd a comment