గంభీర్‌ను కావాలనే తప్పించారు! | netizens shock as Gautam Gambhir quits Delhi Daredevils captaincy | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 25 2018 6:54 PM | Last Updated on Wed, Apr 25 2018 6:54 PM

netizens shock as Gautam Gambhir quits Delhi Daredevils captaincy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-11వ సీజన్‌లో కొత్త ఆశలతో, కొత్త టీమ్‌తో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు అడుగుపెట్టింది. గత ఐపీఎల్‌లలో పెద్దగా రాణించని ఢిల్లీ జట్టు.. ఈసారి కనీసం టాప్‌-4కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు రెండు పర్యాయాలు నాయకత్వం వహించిన గౌతం గంభీర్‌ను కెప్టెన్‌గా తీసుకుంది. అయినా ఈసారి ఢిల్లీకి పెద్దగా కలిసిరాలేదు. వరుస పరాజయాలు వెంటాడుతుండటంతో వ్యక్తిగతంగా, జట్టుపరంగా నైతిక బాధ్యత వహిస్తూ గౌతం గంభీర్‌ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అనూహ్య ప్రకటన చేశాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ అట్టడుగున ఉన్న నేపథ్యంలో పూర్తి బాధ్యత వహిస్తూ తాను సారథ్యం నుంచి తప్పుకుంటున్నానని, ఇది పూర్తిగా తన నిర్ణయమేనని, ఇందులో మేనేజ్‌మెంట్‌ ఒత్తిడిగానీ, కోచ్‌ తరఫు నుంచి ఒత్తిడి గానీ లేదని గంభీర్‌ స్పష్టం చేశారు. గంభీర్‌ స్థానంలో కొత్త కుర్రాడు శ్రేయస్‌ అయ్యర్‌కు ఢిల్లీ ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది.

అయితే, గంభీర్‌ ఆకస్మికంగా చేసిన ప్రకటనపై సోషల్‌ మీడియాలో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. ఢిల్లీ కెప్టెన్సీ నుంచి గంభీర్‌ అనూహ్యంగా తప్పుకోవడంపై ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ జట్టు ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, ఇలాంటి సమయంలో అనుభవజ్ఞుడైన గంభీర్‌ను తప్పించి యువకుడికి పగ్గాలు ఇవ్వడం ఎలా జట్టుకు మేలు చేస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గంభీర్‌ను ఉద్దేశపూర్వకంగా జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించారని, ఇక నుంచి ఆయనను బెంచ్‌కే పరిమితం చేసే అవకాశముందని కొందరు ట్వీట్‌ చేస్తున్నారు. భారత క్రికెట్‌ జట్టులో కీలక వ్యక్తిగా ఎదిగి.. భారత్‌ వరల్డ్‌ కప్‌ సాధించడంలో కీలకంగా వ్యవహరించిన గంభీర్‌ను ఇలా కెప్టెన్సీ నుంచి తొలగించడం బాధ కలిగిస్తోందని, ఇది షాక్‌కు గురిచేస్తోందని ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికీ పాంటింగ్‌ కోచ్‌గా ఉంటే ఢిల్లీ జట్టు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుందని తప్పుబడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement