అందరి నోట.. అయ్యర్‌ మాట | Shreyas Iyers Becomes The Talk Of The Town | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 28 2018 3:10 PM | Last Updated on Sat, Apr 28 2018 3:13 PM

Shreyas Iyers Becomes The Talk Of The Town - Sakshi

సహచర ఆటగాడితో శ్రేయస్‌ అయ్యర్‌

న్యూఢిల్లీ : ఇప్పుడు అందరి నోట.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నూతన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పేరే. శుక్రవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా తనపై ఎలాంటి ఒత్తిడి లేదని నిరూపిస్తూ.. ఈ యువ సారథి బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించి ఢిల్లీ రాత మార్చాడు. జట్టును ముందుండి నడిపించడం అంటే ఏమిటో తొలి మ్యాచ్‌లోనే చూపించాడు.  10 సిక్సర్లతో 40 బంతుల్లో 93 పరుగుల చేసి డేర్‌డెవిల్స్‌కు కీలక విజయాన్ని అందించాడు.  దీంతో ఈ యువ ఆటగాడిపై అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

‘కెప్టెన్‌గా గొప్ప ప్రాంభం.. అద్భుత బ్యాటింగ్‌’ అని కొందరంటే.. ‘హ్యాట్సాఫ్‌ అయ్యర్‌.. నీవు కోహ్లికి సరిపడ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌’వి అని ఇంకొందరు కొనియాడుతున్నారు.  ‘ఈ విజయం అయ్యర్‌కు కెప్టెన్‌గా గొప్ప ప్రారంభం.. మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కడం అతనికి మరిచిపోలేనిదని, ఈ విజయాన్నే సోమవారం చెన్నైతో పునరావృతం చేయాలని’ మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఢిల్లీ వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ గౌతం గంభీర్‌ తన కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న అయ్యర్‌ ఢిల్లీకి తొలి మ్యాచ్‌లోనే చిరస్మరణీయ విజయాన్నందించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement