హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన మ్యాక్స్‌వెల్(2) రనౌట్ కావడంతో ఢిల్లీ తొమ్మిది పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో పృథ్వీ షా-శ్రేయస్ అయ్యర్‌ల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ప్రధానంగా పృథ్వీ షా చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే 25 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు.
కాగా, పృథ్వీ షా(65;36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిద్దార్థ్ కౌల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 95 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ను నష్టపోయింది. పృథ్వీ షా ఔటైన తర్వాత స్కోరు బోర్డు నెమ్మదించింది. దాంతో స్కోరును పెంచే క్రమంలో భారీ షాట్‌కు యత్నించి శ్రేయస్ అయ్యర్(44;36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ఔటయ్యాడు. ఆపై పరుగు వ్యవధిలో నమాన్ ఓజా(1), రిషబ్ పంత్(18)లు పెవిలియన్ చేరడంతో ఢిల్లీ స్కోరు మరింత మందగించింది. చివర్లో విజయ్ శంకర్(23 నాటౌట్; 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్పర్) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు సాధించగా, సిద్ధార్థ్ కౌల్‌కు వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment