
ఎవిన్ లూయిస్
ముంబై : సొంత మైదానంలో ఢిల్లీడేర్ డేవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు చెలరేగారు. దీంతో ముంబై పవర్ ప్లే ముగిసే సరికి 84 పరుగులు చేసింది. పవర్‌ప్లే లో వచ్చిన ఈ పరుగులు ఐపీఎల్ చరిత్రలో ముంబైకి అత్యధికం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన యువఆటగాడు సూర్యకుమార్ యాదవ్ 53(32 బంతులు, 7ఫోర్లు, ఒక సిక్సు) అర్ధ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్‌లు48(28 బంతులు,4 ఫోర్లు, 4 సిక్సులు) తృటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. దీంతో 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్ సైతం వికెట్ల ముందు దొరికి పెవిలియన్ చేరాడు. అయితే ఈ సీజన్‌లో తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
ఇక టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ తొలుత ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇంకా బోణీ చేయకపోవడంతో గెలుపుపై దృష్టి సారించాయి. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చేతిలో ముంబై ఇండియన్స్‌కు పరాజయం ఎదురుకాగా, కింగ్స్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై ఢిల్లీ ఓటమి పాలైంది. దాంతో ఇరు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment