
ముంబై: ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. గతేడాది వరకు ఢిల్లీ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కారణంగా వైదొలిగాడు. అతడి స్థానంలో పాంటింగ్‌ను నియమించినట్లు డేర్ డెవిల్స్ సీఈవో హేమంత్ దువా తెలిపాడు. పాంటింగ్ 2015, 2016లలో ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గా వ్యవహరించాడు.