ఐపీఎల్‌: వర్షం ఆటంకం.. ఢిల్లీ స్కోర్‌ 196/6 | Play Stopped Due to Rain | Sakshi
Sakshi News home page

May 2 2018 11:24 PM | Updated on May 2 2018 11:25 PM

Play Stopped Due to Rain - Sakshi

రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం మరోసారి ఆటంకంగా మారింది. మ్యాచ్‌ ఆరంభం ముందు వర్షం రావడంతో అంపైర్లు ఆటను 18 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ రెండోసారి వర్షం వచ్చే సమయానికి 17.1 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌ పంత్‌ 69(29 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ 50(35 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్స్‌లు), పృథ్వీషా 47(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు చెలరేగడంతో ఢిల్లీ భారీస్కోర్‌ సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement