టాస్ వేస్తున్న అయ్యర్
న్యూఢిల్లీ : ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్ అజింక్యా రహానే ఫీల్డింగ్‌వైపు మొగ్గు చూపాడు. ఇరు జట్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ జట్టులో రాహుల్ తెవాటియా స్థానంలో షబాజ్ నదీమ్ తుది జట్టులోకి వచ్చాడు. రాజస్తాన్ జట్టులోకి ఇష్ సోదీ, మహిపాల్ లోమ్రా స్థానంలో డియార్సీ షార్ట్, శ్రేయస్ గోపాల్‌లు వచ్చారు. ఇక ఢిల్లీ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఈ మ్యాచ్‌కు సైతం దూరంగా ఉన్నాడు.
ఇక ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. గత మ్యాచ్‌లో చెన్నై విధించిన భారీ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాట్స్‌మెన్ చివరి వరకు పోరాడారు. ఈ నేపథ్యంలో సొంత మైదానంలో మ్యాచ్ జరగడం ఢిల్లీకి కలిసొచ్చె అంశం. రాజస్తాన్ రాయల్స్ సైతం 7 మ్యాచ్‌లో 3 మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో కింది నుంచి మూడో స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవం చేసుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల ఒకసారి తలపడగా.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం విజయం రాజస్తాన్‌నే వరించింది. ఇక రాజస్తాన్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి విజయం.
తుది జట్లు:
ఢిల్లీ: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), లియామ్ ప్లంకెట్, అమిత్ మిశ్రా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కోలిన్ మున్రో, ట్రెంట్ బౌల్ట్, విజయ్ శంకర్, షబాజ్ నదీమ్, అవేశ్ ఖాన్, రిషబ్ పంత్, పృథ్వీ షా
రాజస్తాన్ రాయల్స్: అజింక్యా రహానే(కెప్టెన్), డియార్సీ షార్ట్, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, బెన్ స్టోక్స్, బట్లర్, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ధావల్ కులకర్ణి, జయదేవ్ ఉనాద్కట్
Comments
Please login to add a commentAdd a comment