![Rain Interrupted Today Ipl Match - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/2/rain_0.jpg.webp?itok=bAK5o5Cs)
కవర్లతో కప్పేసిన మైదానం
న్యూఢిల్లీ: ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్తాన్ రాయల్స్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారింది. టాస్ అనంతరం ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టె సమయానికి వర్షం అంతరాయం కలిగించడంతో మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. అంతకుముందు టాస్ గెలిచిన రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం (జైపూర్) వేదికగా జరిగిన మ్యాచ్‌కు సైతం వర్షం అంతరాయం కలిగించింది. ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం రాజస్తాన్‌నే విజయం వరించింది.
Comments
Please login to add a commentAdd a comment