రహానే
జైపూర్: పేలవ ఆటతీరుతో తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన రాజస్తాన్ రాయల్స్... సొంత గడ్డపై వరుణుడి అండతో ఢిల్లీపై 10 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది. వర్షం కారణంగా 6 ఓవర్లకు 71 పరుగులుగా కుదించిన లక్ష్యాన్ని డేర్‌డెవిల్స్ అందుకోలేకపోయింది. ఆ జట్టు 6 ఓవర్లలో 4 వికెట్లకు 60 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్... 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసిన సమయంలో వాన అంతరాయం కలిగించింది.
చాలాసేపటి తర్వాత మ్యాచ్ మొదలుకాగా... డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం డేర్ డెవిల్స్ లక్ష్యాన్ని 6 ఓవర్లకు 71గా నిర్దేశించారు. అయితే... విధ్వంసక ఓపెనర్ మున్రో (0) తొలి బంతికే రనౌట్ కావడం, మ్యాక్స్‌వెల్ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) ధాటిగా ఆడలేకపోవడంతో లక్ష్యానికి ఢిల్లీ మరో 11 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. అంతకుముందు రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో కెప్టె న్ రహానే (40 బంతుల్లో 45, 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సంజు శామ్సన్ (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాస్ బట్లర్ (18 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొద్దిసేపు మెరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment