ఢిల్లీ: రిషబ్ పంత్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో కీలక ఆటగాడు. అయితే అతనితో పరుగు తీయాలంటే అవతలి ఎండ్‌లో ఉన్న సహచర ఆటగాడు ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ నాలుగుసార్లు రనౌట్‌లో భాగస్వామ్యం అయ్యాడు రిషబ్. ఆ నాలుగుసార్లు సహచర ఆటగాడే నిష్క్రమించడం రిషబ్‌లో చురుకుదనం లేదనడానికి అద్దం పడుతోంది. పరుగు పూర్తి చేసే క్రమంలో తటపటాయిస్తున్న రిషబ్.. అవతలి ఎండ్‌లో ఉన్న ఆటగాళ్ల రనౌట్‌కు కారణమవుతున్నాడు.
గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే ఢిల్లీ ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంటుంది. అయితే ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హర్షల్ పటేల్ రనౌట్లలో రిషబ్ పంత్ భాగస్వామ్యం కావడం విమర్శలకు తావిచ్చింది. తొలుత శ్రేయస్ అయ్యర్‌ను రనౌట్ చేసిన రిషబ్.. ఆపై హర్షల్ పటేల్ రనౌట్‌కు కారణమయ్యాడు.
పరుగు సూచన ఇచ్చిన రిషబ్ పంత్.. శ్రేయస్ అయ్యర్ సగం పిచ్ దాటే సమయంలో నిర్ణయం మార్చుకున్నాడు. క్రీజ్‌లో అలా నిలబడి ఉండిపోవడంతో శ్రేయస్ అయ్యర్ మళ్లీ తిరిగి నాన్ స్టైకర్ ఎండ్‌లోకి వచ్చే యత‍్నం చేయడంతో రనౌట్ కావాల్సి వచ్చింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సన్‌రైజర్స్ బౌలర్ వేసిన ఎనిమిదో ఓవర్ నాల్గో బంతికి అయ్యర్‌ను రనౌట్‌గా పెవిలియన్‌కు పంపించాడు. మళ్లీ ఇదే మ్యాచ్ రషీద్ ఖాన్ వేసిన 14 ఓవర్ చివరి బంతికి హర్షల్ పటేల్‌ను రనౌట్ చేశాడు రిషబ్. ఈ రెండు సందర్బాల్లో రిషబ్ పంత్ తప్పిదం కొట్టొచ్చినట్లు కనబడటం ఢిల్లీ డేర్‌డెవిల్స్ శిబిరంలో ఆందోళన వ్యక్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment