
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేల పరుగుల మార్కును చేరిన 12వ ఆటగాడిగా దినేశ్ కార్తీక్ నిలిచాడు. తాజా మ్యాచ్‌లో కార్తీక్ ఏడు పరుగుల వద్ద ఉండగా ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. తన కెరీర్‌లో 156వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న కార్తీక్138 ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగుల మైలురాయిని దాటాడు.తద్వారా అజింక్యా రహానే(3,151) తర్వాత స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో సురేశ్ రైనా(4,558) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లి(4,527), రోహిత్ శర్మ(4,251) ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు.ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నరైన్(1) నిరాశపరచగా, క్రిస్ లిన్(31)ఉతప్ప(35) ఫర్వాలేదనిపించారు. కార్తీక్(19) అనవసరపు షాట్‌కోసం యత్నించి నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment