
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్‌తో ఇక్కడ వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ తొలుత ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇంకా బోణీ చేయకపోవడంతో గెలుపుపై దృష్టి సారించాయి. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చేతిలో ముంబై ఇండియన్స్‌కు పరాజయం ఎదురుకాగా, కింగ్స్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై ఢిల్లీ ఓటమి పాలైంది. దాంతో ఇరు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. గత మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన ముంబై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి తుది జట్టులోకి వచ్చాడు.
అదే సమయంలో బెన్ కట్టింగ్ స్థానంలో అకిల దనంజయను జట్టులోకి తీసుకున్నారు. మరొకవైపు కోలిన్ మున్రో, క్రిస్ మోరిస్‌లకు ఢిల్లీ విశ్రాంతినిచ్చింది. వారి స్థానాల్లో జాసన్ రాయ్, డానియల్ క్రిస్టియన్‌లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ తుది జట్టులోకి వచ్చారు. గత రెండు మ్యాచ్‌లకు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన స్టార్ ఆటగాడు జాసన్ రాయ్‌పై ఢిల్లీ భారీగానే ఆశలు పెట్టుకుంది. రాయ్ రాకతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని భావించిన ఢిల్లీ.. అతనికి తుది జట్టులో చోటు కల్పించింది. ఇది ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున రాయ్‌కు తొలి మ్యాచ్ కావడం విశేషం.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఎవిన్ లూయిస్, ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, మయాంక్ మార్కండే, జస్ప్రిత్ బూమ్రా, ముస్తాఫిజుర్ రహ్మన్, అకిల దనంజయ
ఢిల్లీ డేర్‌డెవిల్స్: గౌతం గంభీర్‌ఖ(కెప్టెన్), జాసన్ రాయ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, విజయ్ శంకర్, డానియల్ క్రిస్టియన్, రాహుల్ తెవాతియా, షహబాజ్ నదీమ్, మొహ్మద్ షమీ, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment