
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో నగరంలోని వాంఖేడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఎటు చూసినా చిన్నారులే కనిపిస్తున్నారు. నీలం రంగు జెర్సీలో వేసుకుని ముంబై ఇండియన్స్ జెండాలతో స్డేడియంలో సందడి చేస్తున్నారు. ఏకంగా 21వేల మంది చిన్నారులు గ్యాలరీల్లో కూర్చొని ముంబై ఇండియన్స్ కు మద్దతు తెలియజేస్తున్నారు. ఈ చిన్నారులే నేటి మ్యాచ్‌కు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చారు. వాస్తవానికి ఈరోజును ఈఎస్ఏ(ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్) డేగా రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది.
దీనిలో భాగంగానే ముంబైలోని పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన చిన్నారులను మ్యాచ్ జరుగుతున్న స్టేడియంకు తీసుకొచ్చారు. ముంబయి ఇండియన్స్-రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారందరికీ ఉచితంగా మ్యాచ్ చూసే సదుపాయాన్ని కల్పించారు. మొత్తం 33వేల సామర్థ్యం కలిగి ఉన్న వాంఖడే స్టేడియంలో ఈరోజు ఎటు చూసినా చిన్నారులే కనిపిస్తున్నారు. పిల్లలకు చదువు, క్రీడల్లో సమగ్ర అభివృద్ధితో పాటు సమాన అవకాశాలను ఈఎస్ఏ కల్పిస్తోంది. స్వచ్ఛంద సంస్థలతో కలసి నిరుపేద పిల్లలకు విద్యను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment