ఎక్స్‌ట్రాలు లేకుండా 14 ఓవర్లు.. | KKR gives first extra at 15th over | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ట్రాలు లేకుండా 14 ఓవర్లు..

Published Fri, Apr 27 2018 9:26 PM | Last Updated on Fri, Apr 27 2018 10:13 PM

KKR gives first extra at 15th over - Sakshi

ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో శుక్రవారం ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌-ఢిల్లీ డేర్‌డెవిల్స్‌  జట‍్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. తొలుత టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న  కోల్‌కతా.. బౌలింగ్‌లో ఎంతో నియంత్రణను ప‍్రదర్శించింది. 14 ఓవర్ల పాటు కనీసం ఒక్క ఎక్స్‌ట్రా కూడా లేకుండా బౌలింగ్‌ వేసింది కోల్‌కతా. మిచెల్‌ జాన్సన్‌, ఆండ్రీ రస్సెల్‌, పీయూష్‌ చావ్లా, కుల్దీప్‌ యాదవ్‌, శివం మావి, సునీల్‌ నరైన్‌లు తమ బౌలింగ్‌లో వైడ్లు కానీ, నో బాల్స్‌ కానీ ఇవ్వకుండా ఆకట్టుకున్నారు.

చివరకు 15 ఓవర్‌ తొలి బంతికి నైట్‌రైడర్స్‌ వైడ్‌తో ఎక్స్‌ట్రాకు స్వాగతం పలికింది. కోల్‌కతా బౌలర్‌ ఆండ్రీ రస్సెల్‌ ఇన్నింగ్స్‌ తొలి వైడ్‌ను వేశాడు. దాంతో 14 ఓవర్లపాటు అదనపు పరుగు లేకుండా బౌలింగ్‌ చేసి అరుదైన ఘనతను కేకేఆర్‌ లిఖించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement