
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు అవీష్ ఖాన్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఐదో ఓవర్‌ను ఢిల్లీ బౌలర్ ప్లంకెట్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని రాహుల్ షార్ట్ ఫైన్‌లెగ్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అవీష్ ఖాన్ క్యాచ్‌ను డైవ్ కొట్టి పట్టాడు.
తొలుత బంతి గమనాన్ని అంచనా వేసిన అవీష్.. బంతి నేలను తాకే క్రమంలో చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నాడు. దాంతో పంజాబ్ 42 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు అరోన్ ఫించ్(2) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment