
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌లో భాగంగా సోమవారం ఈడెన్ గార్డెన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు చెరో మ్యాచ్ మాత్రమే గెలిచిన ఇరు జట్లు.. ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలగా ఉన్నాయి. కోల్‌కతా ఫ్రాంచైజీ నుంచి తప్పుకొని ఢిల్లీ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న గౌతం గంభీర్.. తొలిసారి ఈ సీజన్‌లో కోల్‌కతాలో ఆ జట్టుపై ఎలా ఆడతాడో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ నుంచి కేకేఆర్ పేసర్ మిచెల్ జాన్సన్‌కు విశ్రాంతి కల్పించారు. అతని స్థానంలో టామ్ కుర్రాన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. మరొకవైపు ఢిల్లీ జట్టులో క్రిస్టియన్ స్థానంలో క్రిస్ మోరిస్‌ను జట్టులోకి తీసుకున్నారు.
తుది జట్లు
కేకేఆర్
దినేశ్ కార్తీక్(కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్, శుభ్‌మాన్ గిల్, శివం మావి, టామ్ కుర్రాన్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్
ఢిల్లీ
గౌతం గంభీర్(కెప్టెన్), జాసన్ రాయ్, రిషబ్ పంత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శ్రేయస్ అయ్యర్, విజయ్ శంకర్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాతియా, షెహబాజ్ నదీమ్, మొహ్మద్ షమీ, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment