
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 201 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేకేఆర్ ఆటగాళ్లు నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్ మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు రెండొందల మార్కును చేరింది.
రానా 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేయగా, రస్సెల్ 12 బంతుల్లో 6 సిక్సర్లతో 41 పరుగులు సాధించాడు. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్(19) ఔటైన తర్వాత వచ్చిన రస్సెల్.. నితీష్ రానాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ బౌండరీలను దాటించడమే లక్ష్యంగా చెలరేగి ఆడటంతో కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ క్రమంలోనే రానా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే రానా అర్థ శతకం సాధించిన తర్వాత రస్సెల్ ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మిగతా కేకేఆర్ ఆటగాళ్లలో క్రిస్ లిన్(31; 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఉతప్ప(35; 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. దాంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు చెరో మ్యాచ్ మాత్రమే గెలిచిన ఇరు జట్లు.. ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలగా ఉన్నాయి. కోల్‌కతా ఫ్రాంచైజీ నుంచి తప్పుకొని ఢిల్లీ తరపున గౌతం గంభీర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment