
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 188 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. రిషబ్ పంత్(128 నాటౌట్;63 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును సన్‌రైజర్స్ ముందుంచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. షకిబుల్ హసన్ వేసిన నాల్గో ఓవర్‌లో పృథ్వీ షా(9), జాసన్ రాయ్(11)లు వరుస బంతుల్లో నిష్ర్రమించారు. దాంతో 21 పరుగులకే రెండు వికెట్లను నష్టపోయింది ఢిల్లీ. అయితే శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశాడు. కాగా, రిషబ్ పంత్ తప్పిదంతో శ్రేయస్ అయ్యర్(3) రనౌట్‌గా పెవిలియన్ బాటపట్టాడు. అటు తర్వాత హర్షల్ పటేల్-రిషబ్ పంత్‌ల భాగస్వామ్యంతో ఢిల్లీ కుదుటపడింది. హర్షల్ పటేల్(24) రనౌట్ కావడంతో ఢిల్లీ 98 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది. ఆపై రిషబ్ పంత్ చెలరేగి ఆడాడు. పటిష్టమైన సన్‌రైజర్స్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగిన రిషబ్ పంత్ 56 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లను రిషబ్ సాధించడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో షకిబుల్ హసన్ రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్‌కు వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment