
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో టాస్ సెంటిమెంట్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన జట్లు ఎటువంటి ఆలోచనా లేకుండా తొలుత ఫీల్డింగ్ చేయడానికి మొగ్గుచూపుతుండటం ఫ్రాంచైజీల సెంటిమెంట్‌గా చెప్పవచ్చు. మరొకవైపు ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో దాదాపు టాస్ గెలిచిన జట్లనే విజయం వరించడం ఇక్కడ మరో విశేషం. దాంతో టాస్ గెలవడం, ఫీల్డింగ్ చేయడంపైనే అన్ని జట్లు దృష్టి పెట్టాయి. కాకపోతే రాజస్తాన్ రాయల్స్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం మాత్రం టాస్ గెలిచిన జట్టుకు భిన్నంగా వచ్చింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఫలితం డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 6 ఓవర్లకు నిర్దేశించడంతో ఇక్కడ టాస్‌కు పెద్ద ప్రాధాన‍్యత లేకుండా పోయింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇది తొమ్మిదో మ్యాచ్ కాగా, వీటిన్నంటిలోనూ టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్ తీసుకోవడం ‘టాస్’ సెంటిమెంట్‌కు అద్దం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment