రిషబ్ పంత్, ట్రెంట్ బౌల్ట్
హైదరాబాద్ : ఐపీఎల్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆరేంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌లు ఇప్పుడు ఒకే జట్టుకు సొంతమయ్యాయి. సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌కు ఆరేంజ్‌క్యాప్.. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్‌లు ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత సీజన్‌లో ఈ రెండిటిని ఒకే జట్టు ఆటగాళ్లు సొంతం చేసుకున్నారు. బుధవారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ 69(29 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఈ పరుగులతో ఈ యువ బ్యాట్స్‌మన్ ఆరేంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇప్పటి వరకు పంత్ 9 మ్యాచ్‌ల్లో 180.28 స్ట్రైక్‌రేట్‌తో 375 పరుగులు సాధించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు(370)ని వెనక్కి నెట్టాడు. ఇదే మ్యాచ్‌లో.. ఢిల్లీ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్ 9.17 ఎకానమితో 13 వికెట్లు సాధించి బౌలర్ల జాబితా అగ్రస్థానంలో నిలిచాడు. బౌల్ట్ తర్వాతి స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ సిద్దార్ధ్ కౌల్ (9) ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment