టాస్‌ గెలిచిన సీఎస్‌కే | CSK won the toss and elected to field first | Sakshi

టాస్‌ గెలిచిన సీఎస్‌కే

Published Fri, May 18 2018 7:38 PM | Last Updated on Fri, May 18 2018 8:19 PM

CSK won the toss and elected to field first - Sakshi

ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శుక్రవారం ఇక్కడ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. ఢిల్లీని  బ్యాటింగ్‌ చేయాల్సిందిగా కోరాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో చెన్నై ప్లే ఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకోగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 12 మ్యాచ్‌ల్లో 3 విజయాలు మాత్రమే నమోదు చేసి టోర్నీ నుంచి నిష్ర్రమించింది.

ఇది ఇరు జట్లకు నామమాత్రపు మ్యాచ్‌గానే చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా నష్టమేమీ ఉండదు. దాంతో ఇరు జట్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. చెన్నై ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా, ఢిల్లీ రెండు మార్పులు చేసింది. డేవిడ్‌ విల్లే స్థానంలో లుంగి ఎంగిడి చెన్నై తుది జట్టులోకి రాగా, మ్యాక్స్‌వెల్‌, అవేశ్‌ ఖాన్‌లు ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement