
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అజింక్యా రహానే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బుధవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ సారథి అజింక్యా రహానే 40 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 45 పరుగులు సాధించాడు. ఫలితంగా ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రహానే గుర్తింపు సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌లో ఢిల్లీపై రహానే సాధించిన పరుగులు 673. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, కోహ్లిలను రహానే అధిగమించాడు.
ఐపీఎల్‌లో ఢిల్లీపై రోహిత్ శర్మ నమోదు చేసిన పరుగులు 670 కాగా, విరాట్ కోహ్లి 661 పరుగుల్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై సాధించాడు. వీరు వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉండగా, రాబిన్ ఉతప్ప 551 పరుగులతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సురేశ్ రైనా 491 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment