
జైపూర్ : ఐపీఎల్-11లో దేశ విదేశ ఆటగాళ్లు వారి వారి ప్రత్యేక ప్రతిభలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్యా రహానే తనలోని బ్యాటింగ్ నైపుణ్యమే కాకుండా మరో ఆటలోని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాజస్తాన్ ఆటగాళ్లు రహానే, బెన్ లాఫిన్, ధావల్ కులకర్ణిలు కరాటే ఫోజుల ఇస్తూ అభిమానులను అలరించారు. దీనికి సంబందించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ తమ అధికారికి ట్వీటర్‌లో షేర్ చేసింది. ‘రహానే తనలోని కరాటే ఆటగాన్ని బెన్ లాఫిన్, దావల్ కలకర్ణితో కలిసి భయటపెట్టాడు’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
ఇక రాజస్తాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా మూడింట గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరగబోయే మ్యాచ్ కోసం రాజస్తాన్ జట్టు సన్నద్దమవుతోంది