
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. సన్‌రైజర్స్ ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించింది.
అదే సమయంలో ఢిల్లీ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి మూడు విజయాల్ని మాత్రమే సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సన్‌రైజర్స్ తుది జట్టులోకి భువనేశ్వర్ తిరిగి రాగా, బాసిల్ థంపికి విశ్రాంతి కల్పించారు. మరొకవైపు ఢిల్లీ రెండు మార్పులు చేసింది. నమాన్ ఓజా, డానియల్ క్రిస్టియన్‌లు జట్టులోకి రాగా, మున్రో, షహబాజ్ నదీమ్‌లను తప్పించారు.
తుదిజట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్
కేన్ విలియమ్సన్(కెప్టెన్), అలెక్స్ హేల్స్, శిఖర్ ధావన్, మనీష్ షాండే, షకీబుల్ హాసన్, యుసుఫ్ పఠాన్, వృద్దిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్, రషీద్‌ఖాన్, సిద్ధార్థ్‌కౌల్, సందీప్ శర్మ
ఢిల్లీ డేర్‌డెవిల్స్
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, నమాన్ ఓజా, రిషబ్ పంత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, విజయ్ శంకర్, డానియల్ క్రిస్టియన్, లియామ్ ప్లంకెట్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment