
పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోహైల్ ఖాన్ తన నిర్ణయాన్ని ఆదివారం ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలియజేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ డొమాస్టిక్ వైట్‌బాల్ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని సోహైల్ సృష్టం చేశాడు. తన 15 ఏళ్ల ప్రయాణంలో మద్దతుగా నిలిచిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అభిమానలకు, సహచర ఆటగాళ్లకు సోహైల్ ధన్యవాదాలు తెలిపాడు.
సోహైల్ ఖాన్ 2008 జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అతడు చివరగా 2016 ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పాక్ తరపున ఆడాడు. తన కెరీర్‌లో సోహైల్ 9 టెస్టు, 13 వన్డేలు, 5 టీ20ల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో సోహైల్‌కు మంచి రికార్డు ఉంది. 9 మ్యాచ్‌ల్లో 3.69 ఏకానమీతో 27 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా వన్డేల్లో 19 వికెట్లు, టీ20ల్లో 5 వికెట్లు సాధించాడు.
భారత్‌పై 5 వికెట్లు..
ముఖ్యంగా సోహైల్ ఖాన్ కంటే గుర్తు వచ్చేది 2015 వన్డే ప్రపంచకప్. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అతడు 5 వికెట్లు పడగొట్టి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అప్పటిలో అతడి పేరు మారుమ్రోగిపోయింది. కానీ ఆతర్వాత ఏడాదికే జట్టులో అతడు చోటు కోల్పోయాడు.
చదవండి: Asia Cup 2023: ఇదెక్కడి దరిద్రం రా బాబు.. సిక్స్ కొట్టినా ఔటైపోయాడు! వీడియో చూడాల్సిందే