చెన్నై: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీకి బీసీసీఐ నుంచి భారీగా సొమ్ము అందనుంది. ఏక మొత్తం ప్రయోజనం కింద వీరికి రూ. కోటీ 50 లక్షల చొప్పున ఇచ్చేందుకు బోర్డు ఆర్థిక కమిటీ నిర్ణయించింది.
జాతీయ జట్టు తరఫున టెస్టు మ్యాచ్‌లు ఆడి రిటైర్ అయిన వారికి ఈ స్కీం కింద బోర్డు నగదు చెల్లిస్తూ వస్తోంది. మరోవైపు బీసీసీఐలో పాలనా సంస్కరణల గురించి సుప్రీం కోర్టు నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసిన లోధా కమిటీపై ఇప్పటిదాకా రూ.3.90 కోట్లు ఖర్చు చేసినట్టు వచ్చిన కథనాలు అవాస్తవమని బోర్డు తెలిపింది. ఈ మొత్తంలో పదో వంతు మాత్రమే ఖర్చయ్యిందని పేర్కొంది.
ఆ నలుగురుకీ రూ.కోటిన్నర...
Published Sat, May 23 2015 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
Advertisement
Advertisement