మెల్‌బోర్న్: ఆ్రస్టేలియా పేస్ బౌలర్ పీటర్ సిడిల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో టెస్టు కోసం అతడిని ఎంపిక చేసినా... తుది జట్టులో స్థానం దక్కలేదు. 11 ఏళ్ల కెరీర్‌లో 20 వన్డేలు, 2 టి20లు ఆడినా సిడిల్‌కు టెస్టు స్పెషలిస్ట్‌గానే ఎక్కువ గుర్తింపు దక్కింది. 67 టెస్టుల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన 35 ఏళ్ల సిడిల్ 30.66 సగటుతో 221 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 8 సార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. కంగారూల తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 13వ స్థానంతో సిడిల్ తన కెరీర్ ముగించాడు. 2008లో మొహాలిలో తన తొలి టెస్టు ఆడిన సిడిల్ కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ వికెట్ మొదటిది. తర్వాతి ఏడాది ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్‌గా కూడా అవార్డు అందుకున్న అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే వరుస గాయాలతో అతని కెరీర్ సక్రమంగా సాగలేదు. అనేక సార్లు ఆసీస్ తరఫున ఆడి జట్టుకు దూరం కావడం, మళ్లీ పునరాగమనం చేయడం తరచుగా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment