Peter Siddle
-
మ్యాచ్ మధ్యలో బ్రొమాన్స్ ఏంటి.. తట్టుకోలేకపోతున్నాం?!
క్రికెట్లో ఎంటర్టైన్మెంట్ అనేది కామన్. మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగినప్పటికి బ్యాట్స్‌మన్ హిట్టింగ్.. బౌలర్ వికెట్లు తీయడం.. ఆటగాళ్ల మధ్య గొడవలు.. ఇలా ఏది చూసిన చూస్తున్న ప్రేక్షకుడికి మంచి ఆనందాన్ని ఇస్తుంది. బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఇలాంటివి కోకొల్లలు. ఇక ఈ సీజన్ విషయానికి వస్తే ఒక మ్యాచ్‌లో జోష్ ఫిలిప్, మ్యాక్స్‌వెల్‌లు నోటితో కాకుండా బ్యాట్‌తో మాట్లాడుకోవడం.. ఇక ఆండ్రూ టై, జహీర్ ఖాన్లు వికెట్లతో మాట్లాడుకోవడం ఫన్నీగా కనిపించింది. చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాకు బిగ్‌షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం అయితే తాజాగా డేనియల్ వొర్రాల్, పీటర్ సిడిల్ల మధ్య జరిగిన బ్రొమాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసెంబర్ 21న సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సిడిల్.. వొర్రాల్ చెంపై ముద్దుపెట్టడం ఆసక్తి కలిగించింది. అడిలైడ్ స్ట్రైకర్స్ కెప్టెన్ పీటర్ సిడిల్ 147 పరుగుల టార్గెట్‌ను కాపాడుకునేందుకు తొలి ఓవర్‌ను డేనియల్ ఓర్రల్తో వేయించాడు. తొలి బంతి వేసిన అనంతరం సిడిల్ ఓర్రల్ దగ్గరకు వచ్చి సుధీర్ఘంగా చర్చించాడు. ఈ నేపథ్యంలో సిడిల్ వోర్రల్ చెంపపై ముద్దు పెట్టడం కెమెరాలకు చిక్కింది. మొదట షాకైన వోర్రల్.. ఆ తర్వాత నవ్వుతూ సిడిల్ చర్యను ఆహ్వానించాడు. అయితే దీనిపై ఫ్యాన్స్ మాత్రం వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. ''ఆట మధ్యలో ఇలాంటి బ్రొమాన్స్లు ఏంటి భయ్యా.. తట్టుకోలేకపోతున్నాం.. మీ బ్రొమాన్స్ తగలయ్యా..'' అంటూ పేర్కొన్నారు. ఇక మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. థామస్ కెల్లీ 41 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. వెల్స్ 32 పరుగులు చేశాడు. అనంతరం సిడ్నీ సిక్సర్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. జోర్డాన్ సిల్క్ 36, మొయిసెస్ హెన్రిక్స్ 28 పరుగులు చేశాడు. చదవండి: Vijay Hazare Trophy 2021: జట్టు మొత్తం స్కోరు 200.. ఒక్కడే 109 బాదాడు Lots of love at @StrikersBBL 😘 #BBL11 pic.twitter.com/3pZg8RjkRy — 7Cricket (@7Cricket) December 21, 2021 -
సిడిల్ గుడ్‌బై
మెల్బోర్న్: ఆ్రస్టేలియా పేస్ బౌలర్ పీటర్ సిడిల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో టెస్టు కోసం అతడిని ఎంపిక చేసినా... తుది జట్టులో స్థానం దక్కలేదు. 11 ఏళ్ల కెరీర్లో 20 వన్డేలు, 2 టి20లు ఆడినా సిడిల్‌కు టెస్టు స్పెషలిస్ట్‌గానే ఎక్కువ గుర్తింపు దక్కింది. 67 టెస్టుల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన 35 ఏళ్ల సిడిల్ 30.66 సగటుతో 221 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 8 సార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. కంగారూల తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 13వ స్థానంతో సిడిల్ తన కెరీర్ ముగించాడు. 2008లో మొహాలిలో తన తొలి టెస్టు ఆడిన సిడిల్ కెరీర్లో సచిన్ టెండూల్కర్ వికెట్ మొదటిది. తర్వాతి ఏడాది ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్‌గా కూడా అవార్డు అందుకున్న అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే వరుస గాయాలతో అతని కెరీర్ సక్రమంగా సాగలేదు. అనేక సార్లు ఆసీస్ తరఫున ఆడి జట్టుకు దూరం కావడం, మళ్లీ పునరాగమనం చేయడం తరచుగా జరిగింది. -
క్రికెట్‌కు సిడెల్ గుడ్ బై
మెల్బోర్న్: ఆసీస్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడెల్ తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆసీస్ తరఫున 11 ఏళ్లు క్రికెట్ ఆడిన 35 ఏళ్ల సిడెల్ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. తాను రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే తగిన సమయమని భావించి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు వెల్లడించాడు. ఆసీస్ జట్టుకు ఆడటాన్ని గొప్పగా భావించానని చెప్పుకొచ్చిన సిడెల్.. కాస్త బాధతోనే క్రికెట్‌కు ముగింపు పలుకుతున్నానని అన్నాడు. ‘ నా చిన్నతనంలో నాలో క్రికెట్ పరంగా సూపర్ టాలెంట ఏమీ లేదు. ఆసీస్‌కు ఆడాలనే ప్రయత్నంలో ఎక్కువగా శ్రమించే లక్ష్యాన్ని చేరుకున్నా. బ్యాగీ గ్రీన్‌ను ధరించడం గొప్పగా భావించా. ఒక్కసారి ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహిస్తే సరిపోతుందని అనుకున్నా. యాషెస్ సిరీస్ వంటి ప్రతిష్టాత్మక సిరీస్ కూడా ఆడా. నేను ఆడుతున్న సమయంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు అరంగేట్రం చేశారు. ఆపై వారు క్రికెట్ నుంచి వీడ్కోలు కూడా తీసుకున్నారు. వారు నా కంటే చాలా వయసులో ఉన్నారు. వారి వ్యక్తిగత కారణాల వల్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. నేను జట్టు నుంచి ఉద్వాసన గురైన ప్రతీసారి నాలో సత్తాను నిరూపించుకుని మళ్లీ జట్టులోకి వచ్చా’ అని సిడెల్ తెలిపాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 67 టెస్టులు ఆడిన సిడెల్.. 221 వికెట్లు సాధించాగు. అందులో ఐదు వికెట్ల మార్కును ఎనిమిదిసార్లు చేరాడు. ఆసీస్ తరఫున 13వ అత్యధిక వికెట్ టేకర్‌గా సిడెల్ ఉన్నాడు. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అది కూడా సిడెల్ 26వ బర్త్ డే రోజున హ్యాట్రిక్ సాధించాడు. ఇక 20 వన్డేలు, రెండు టీ20లు సిడెల్ ఆడాడు. ఆసీస్ తరఫున చివరగా యాషెస్ సిరీస్‌లో సిడెల్ పాల్గొన్నాడు. -
‘మెక్‌గ్రాత్‌ను గుర్తుకు తెస్తున్నాడు’
లండన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ పేసర్ పీటర్ సిడెల్ రెండు వికెట్లు మాత్రమే తీసినప్పటికీ అతనిపై అసిస్టెంట్ కోచ్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. పీటెర్ సిడెల్ బౌలింగ్ చూస్తుంటే దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ గుర్తుకు వస్తున్నాడంటూ కొనియాడాడు. మెక్‌గ్రాత్ బౌలింగ్ యాక్షన్‌కు, సీడెల్ బౌలింగ్ యాక్షన్ చాలా దగ్గర లక్షణాలు ఉన్నాయంటూ ప్రశంసించాడు. ‘మెక్‌గ్రాత్ ఒక గొప్ప బౌలర్. అందులోనూ లార్డ్స్‌లో అతనికి ఘనమైన రికార్డు ఉంది. లార్డ్స్‌లో బౌలింగ్ చేయడాన్ని మెక్‌గ్రాత్ ఎక్కువ ఇష్టపడేవాడు. ఇప్పుడు పీటర్ సిడెల్‌ను చూస్తుంటే నాకు మెక్‌గ్రాత్ గుర్తుకు వస్తున్నాడు. మెక్‌గ్రాత్ అమోఘమైన స్వింగ్ బౌలర్ కాదు. కానీ సరైన లెంగ్త్‌లో కింది వాటంలో బౌలింగ్ చేయడంలో మెక్‌గ్రాత్ దిట్ట. ప్రస్తుతం సిడెల్ కూడా అదే తరహాలో బౌలింగ్ చేస్తున్నాడు. గత కొంతకాలంగా సిడెల్ బౌలింగ్ గొప్ప పరిణితి వచ్చింది’ అని పాంటింగ్ తెలిపాడు. ఇక హజల్‌వుడ్‌ను పక్కకు పెట్టి సిడెల్‌ను తొలి టెస్టులో ఆడించడంపైఐ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. బర్మింగ్‌హామ్ వికెట్ అనేది ఫ్లాట్ వికెట్. ఇది సిడెల్‌కు కచ్చితంగా సరిపోతుందని భావించాం. అందుకే అతన్ని తుది జట్టులో ఎంపిక చేశాం’ అని లాంగర్ పేర్కొన్నాడు. -
అతడి రాకతో జట్టు మరింత పటిష్టం: స్మిత్
సిడ్నీ: వరుస ఓటములతో కుంగిపోతున్న ఆస్ట్రేలియా జట్టు గాడిన పడాలంటే మెరుగైన జట్టు ఉండాలని కెప్టెన్ స్టీవ్ స్మిత్ డిసైడ్ అయ్యాడు. దక్షిణాఫ్రికాతో రేపు(గురువారం) జరగనున్న తొలి టెస్టు ద్వారా అరంగేట్రం చేయాలనుకున్న జోయ్ మెన్నీకి నిరాశే ఎదురైంది. కొత్త ఆటగాడు జోయ్ మెన్నీని, సీనియర్ బౌలర్ పీటర్ సిడిల్ లలో ఎవరికి జట్టులో చోటివ్వాలా అని ఆసీస్ క్రికెట్ బోర్డు కూడా ఆలోచించింది. చివరికి అనుభవం ఉన్న సిడిల్ కు అవకాశం ఇచ్చింది. ఇటీవల జరిగిన వరుస సిరీస్ ఓటములతో ఆసీస్ ఆత్మస్థైర్యంలో కాస్త వెనుకంజ వేసింది. మొదట లంక గడ్డపై 3-0తో వైట్ వాష్ కు గురైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో తమ వన్డే చరిత్రలోనే తొలిసారిగా 5-0తో దారుణ ఓటమిని మూటగట్టుకుంది ఆసీస్. తొమ్మిది నెలల కిందట న్యూజిలాండ్ తో సిరీస్ సందర్భంగా గాయపడి జట్టుకు దూరమైన సిడిల్ రావడంతో ఆసీస్ పేస్ విభాగం బలోపేతమవుతోంది. సిడిల్ తో పాటు గాయాల నుంచి కోలుకున్న మిచెల్ స్టార్క్, హజెల్ వుడ్ తమ బెస్ట్ ఆప్షన్స్ అని క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్ కు కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. మరోవైపు వన్డేల్లో ఆసీస్ కు వరుస ఓటములను చూపించిన సఫారీలు.. టెస్టు సిరీస్ లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నారు.