![Peter Siddle Kisses Adelaide Strikers Teammate Daniel Worrall On Cheek - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/21/Peter.jpg.webp?itok=E8Ql1rsR)
క్రికెట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది కామన్. మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగినప్పటికి బ్యాట్స్‌మన్ హిట్టింగ్.. బౌలర్ వికెట్లు తీయడం.. ఆటగాళ్ల మధ్య గొడవలు.. ఇలా ఏది చూసిన చూస్తున్న ప్రేక్షకుడికి మంచి ఆనందాన్ని ఇస్తుంది. బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఇలాంటివి కోకొల్లలు. ఇక ఈ సీజన్ విషయానికి వస్తే ఒక మ్యాచ్‌లో జోష్ ఫిలిప్, మ్యాక్స్‌వెల్‌లు నోటితో కాకుండా బ్యాట్‌తో మాట్లాడుకోవడం.. ఇక ఆండ్రూ టై, జహీర్ ఖాన్‌లు వికెట్లతో మాట్లాడుకోవడం ఫన్నీగా కనిపించింది.
చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాకు బిగ్‌షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం
అయితే తాజాగా డేనియల్ వొర్రాల్, పీటర్ సిడిల్‌ల మధ్య జరిగిన బ్రొమాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసెంబర్ 21న సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సిడిల్.. వొర్రాల్ చెంపై ముద్దుపెట్టడం ఆసక్తి కలిగించింది. అడిలైడ్ స్ట్రైకర్స్ కెప్టెన్ పీటర్ సిడిల్ 147 పరుగుల టార్గెట్‌ను కాపాడుకునేందుకు తొలి ఓవర్‌ను డేనియల్ ఓర్రల్‌తో వేయించాడు. తొలి బంతి వేసిన అనంతరం సిడిల్ ఓర్రల్ దగ్గరకు వచ్చి సుధీర్ఘంగా చర్చించాడు. ఈ నేపథ్యంలో సిడిల్ వోర్రల్ చెంపపై ముద్దు పెట్టడం కెమెరాలకు చిక్కింది. మొదట షాకైన వోర్రల్.. ఆ తర్వాత నవ్వుతూ సిడిల్ చర్యను ఆహ్వానించాడు. అయితే దీనిపై ఫ్యాన్స్ మాత్రం వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. ''ఆట మధ్యలో ఇలాంటి బ్రొమాన్స్‌లు ఏంటి భయ్యా.. తట్టుకోలేకపోతున్నాం.. మీ బ్రొమాన్స్ తగలయ్యా..'' అంటూ పేర్కొన్నారు.
ఇక మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. థామస్ కెల్లీ 41 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. వెల్స్ 32 పరుగులు చేశాడు. అనంతరం సిడ్నీ సిక్సర్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. జోర్డాన్ సిల్క్ 36, మొయిసెస్ హెన్రిక్స్ 28 పరుగులు చేశాడు.
చదవండి: Vijay Hazare Trophy 2021: జట్టు మొత్తం స్కోరు 200.. ఒక్కడే 109 బాదాడు
Lots of love at @StrikersBBL 😘 #BBL11 pic.twitter.com/3pZg8RjkRy
— 7Cricket (@7Cricket) December 21, 2021
Comments
Please login to add a commentAdd a comment