WTC Final: Rohit Sharma achieves major milestone as opener, joins in elite list - Sakshi
Sakshi News home page

WTC FINAL: రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు.. మూడో భారత ఓపెనర్‌గా

Published Sun, Jun 11 2023 9:11 AM | Last Updated on Sun, Jun 11 2023 10:29 AM

Rohit Sharma achieves major milestone as opener in international cricket - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 13000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో భారత ఓపెనర్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద హిట్‌మ్యాన్‌ .. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఇప్పటి వరకు ఓపెనర్‌గా ఆన్ని ఫార్మాట్‌లు కలిపి 295 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 13031 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో ఓపెనర్‌గా 38 సెంచరీలు, 63 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్‌ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్(15758), ఆ తర్వాత స్ధానంలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్( 15335) ఉన్నాడు.

ఇక ఈ ఫైనల్‌ పోరులో టీమిండియా పోరాడతోంది.  భారత జట్టు విజయం సాధించాలంటే ఆఖరి రోజు 280 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో విరాట్‌ కోహ్లి(44), రహానే(20) పరుగులతో ఉన్నారు. అయితే వీరిద్దరికి అపారమైన అనుభవం ఉంది కాబట్టి చివరి రోజు 280 పరుగులు చేయడం అసాధ్యమేమీ కాదు. దానికి తోడు పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. ఇక టీమిండియా స్ఫూర్తి పొందేందుకు ఆ్రస్టేలియాపై ఆఖరి రోజు 325 పరుగులు సాధించి మరీ గెలిచిన ‘గాబా’ను గుర్తు చేసుకుంటే చాలు.
చదవండిWTC FINAL: వంద శాతం విజయం మాదే.. నేను కూడా బ్యాటింగ్‌ చేస్తా: షమీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement