అశ్విన్‌కు ‘క్యారమ్‌ బేబీ 2’ | Ashwin to 'Carrom Baby 2' | Sakshi
Sakshi News home page

అశ్విన్‌కు ‘క్యారమ్‌ బేబీ 2’

Published Mon, Dec 26 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

అశ్విన్‌కు ‘క్యారమ్‌ బేబీ 2’

అశ్విన్‌కు ‘క్యారమ్‌ బేబీ 2’

చెన్నై: అంతర్జాతీయ క్రికెట్‌లో 2016 ఏడాదిని చిరస్మరణీయం చేసుకున్న భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వ్యక్తిగత జీవితాన్ని కూడా అంతే ఆనందంగా ముగించాడు. ఈ నెల 21న అతని భార్య ప్రీతి నారాయణన్‌ రెండో పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా నాలుగు రోజుల తర్వాత ప్రీతి ట్విట్టర్‌ ద్వారా సరదా వ్యాఖ్యలతో ప్రకటించింది. ‘ఈ నెల 21న మాకు క్యారమ్‌ బేబీ 2 పుట్టింది. రాష్ట్రంలో తుఫాను, చెన్నైలో చివరి టెస్టు ముగిసే వరకు ఆమె వేచి చూసింది.

భారత్‌ మ్యాచ్‌ గెలిచిన సమయంలోనైతే చేపాక్‌లోనే పాప పుడుతుందేమోననిపించింది. అయితే ఆమె తర్వాతి రోజు ఈ ప్రపంచంలోకి వచ్చింది. దీని కారణంగా అశ్విన్‌ ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికైన సంతోషకర క్షణాలనుంచి దృష్టి మళ్లరాదని భావించాను. అందుకే ఇప్పుడు చెబుతున్నాను’ అని ప్రీతి వెల్లడించింది. అశ్విన్‌కు ఇప్పటికే ఏడాదిన్నర వయసున్న ‘అఖీరా’ అనే అమ్మాయి ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement