
Zimbabwe's Brendan Taylor Announces Retirement: జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ టేలర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఐర్లాండ్‌తో నేడు(సెప్టెంబరు 13) జరిగే మూడో వన్డే తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అని పేర్కొన్నాడు. 17 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానని, అరంగేట్రం చేసిన నాటి నుంచి జట్టును మెరుగైన స్థితిలో ఉంచేందుకు తన వంతు కృషి చేశానని పేర్కొన్నాడు. బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నానంటూ ట్విటర్ వేదికగా టేలర్ ఓ భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. తన ఎదుగుదలకు తోడ్పడిన జింబాబ్వే క్రికెట్ మేనేజ్‌మెంట్, కోచ్‌లు, అభిమానులు, సహచర ఆటగాళ్లు, తన కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.
2004లో అడుగుపెట్టి..
బ్రెండన్ టేలర్ 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు మొత్తంగా 34 టెస్టులాడిన అతడు... 2320 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికొస్తే... 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన టేలర్.. 118.22 స్ట్రైక్‌రేటుతో 934 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ద శతకాలు ఉన్నాయి. ఇక తనెంతగానో ఇష్టపడే వన్డే క్రికెట్‌లో 204 మ్యాచ్‌లు ఆడి.. 6677 పరుగులతో సత్తా చాటిన టేలర్.. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు(11) చేసిన ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు. 2011-15 మధ్య జింబాబ్వే టీం కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన టేలర్.. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా మూడో వన్డే ఆడిన అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి అతడు నిష్క్రమించనున్నాడు.
చదవండి: IPL 2021 Second Phase: ఇంగ్లీష్ క్రికెటర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ క్రికెటర్
Forever grateful for the journey. Thank you 🙏 pic.twitter.com/tOsYzoE5eH
— Brendan Taylor (@BrendanTaylor86) September 12, 2021
Comments
Please login to add a commentAdd a comment