Brendan taylor
-
జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్‌పై ఐసీసీ నిషేధం
జింబాబ్వే సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్‌పై ఐసీసీ మూడున్నరేళ్లు నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని యాంటీ డోపింగ్ కోడ్ ను కూడా అతిక్రమించినట్లు తేలింది. దీంతో ఐసీసీ అతనిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి జింబాబ్వే తరఫున 2004 నుంచి 2021 వరకు 284 మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 9,938 పరుగులు చేశాడు. వాటిలో 17 సెంచరీలు ఉన్నాయి. అయితే గతేడాదే బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కాగా బ్రెండన్ టేలర్ ఇటీవలే ఓ లేఖలో సంచలన విషయాలు వెల్లడించాడు. గతంలో ఓ భారత వ్యాపారవేత్త క్రికెట్ లీగ్ పై చర్చించేందుకు భారత్ రావాలని కోరాడని, తాను వెళితే డ్రగ్స్ తో పార్టీ ఇచ్చి, తాను డ్రగ్స్ తీసుకున్నప్పటి వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారని టేలర్ లేఖలో తెలిపాడు. ఫిక్సింగ్ కు పాల్పడాలంటూ తనకు 15 వేల డాలర్లు కూడా ఇచ్చారని వెల్లడించాడు. అయితే ఈ సమాచారాన్ని తమతో వెంటనే పంచుకోలేదంటూ ఐసీసీ బ్రెండన్ టేలర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా తన తప్పిదాలను టేలర్ అంగీకరించాడని ఐసీసీ పేర్కొంది. -
ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడు..
జింబాబ్వే తరఫున అత్యధిక శతకాలు(17) బాదిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచిన ఆ దేశ మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్, మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాడు. 2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడని, అందుకు అతను 15000 అమెరికన్ డాలర్లు ఆఫర్ చేశాడని ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశాడు. నాటి ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తాను ఆ వ్యక్తి నుంచి కొంత నగదు కూడా తీసుకున్నట్లు అంగీకరించాడు. To my family, friends and supporters. Here is my full statement. Thank you! pic.twitter.com/sVCckD4PMV — Brendan Taylor (@BrendanTaylor86) January 24, 2022 గతేడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టేలర్.. 2019లో ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చానని, ఆ సందర్భంగా ఓ పార్టీలో కొందరు నాకు కొకైన్ ఆఫర్ చేశారని, తాను కొకైన్ సేవిస్తుండగా వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టారని, ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేయమన్నారని సంచలన స్టేట్మెంట్ను విడుదల చేశాడు. ఆ వ్యాపారవేత్త జింబాబ్వేలో టీ20 లీగ్‌ను లాంచ్ చేస్తామని తనను సంప్రదించాడని, అప్పటికే తమ దేశ క్రికెట్ బోర్డు నుంచి ఆరు నెలలుగా జీతాలు లేవని, తన ఆర్ధిక అవసరాలను ఆసరాగా తీసుకుని సదరు వ్యక్తి తనను ప్రలోభ పెట్టాడని, తాను అంగీకరించకపోయే సరికి బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. గత రెండేళ్లుగా ఈ భారాన్ని మోయలేక మానసికంగా, శారీరకంగా కృంగిపోయానని, అందుకే ఈ స్టేట్మెంట్ను విడుదల చేస్తున్నాని పేర్కొన్నాడు. జింబాబ్వే తరఫున 34 టెస్ట్‌లు, 205 వన్డేలు, 45 టీ20లు ఆడిన టేలర్.. టెస్ట్‌ల్లో 6 సెంచరీలు, వన్డేల్లో 11 సెంచరీలు సహా దాదాపు పది వేల పరుగులు చేశాడు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్.. 2014 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. కాగా, తనను ఫిక్సింగ్ చేయమన్న ఆ వ్యాపారవేత్త ఎవరనే విషయాన్ని మాత్రం టేలర్ వెల్లడించలేదు. చదవండి: ICC Awards 2021: వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే..! -
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన క్రికెటర్
Zimbabwe's Brendan Taylor Announces Retirement: జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ టేలర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఐర్లాండ్‌తో నేడు(సెప్టెంబరు 13) జరిగే మూడో వన్డే తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అని పేర్కొన్నాడు. 17 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానని, అరంగేట్రం చేసిన నాటి నుంచి జట్టును మెరుగైన స్థితిలో ఉంచేందుకు తన వంతు కృషి చేశానని పేర్కొన్నాడు. బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నానంటూ ట్విటర్ వేదికగా టేలర్ ఓ భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. తన ఎదుగుదలకు తోడ్పడిన జింబాబ్వే క్రికెట్ మేనేజ్మెంట్, కోచ్‌లు, అభిమానులు, సహచర ఆటగాళ్లు, తన కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. 2004లో అడుగుపెట్టి.. బ్రెండన్ టేలర్ 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు మొత్తంగా 34 టెస్టులాడిన అతడు... 2320 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికొస్తే... 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన టేలర్.. 118.22 స్ట్రైక్‌రేటుతో 934 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ద శతకాలు ఉన్నాయి. ఇక తనెంతగానో ఇష్టపడే వన్డే క్రికెట్లో 204 మ్యాచ్‌లు ఆడి.. 6677 పరుగులతో సత్తా చాటిన టేలర్.. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు(11) చేసిన ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు. 2011-15 మధ్య జింబాబ్వే టీం కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన టేలర్.. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా మూడో వన్డే ఆడిన అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి అతడు నిష్క్రమించనున్నాడు. చదవండి: IPL 2021 Second Phase: ఇంగ్లీష్ క్రికెటర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ క్రికెటర్ Forever grateful for the journey. Thank you 🙏 pic.twitter.com/tOsYzoE5eH — Brendan Taylor (@BrendanTaylor86) September 12, 2021 -
‘క్రికెట్‌కు వీడ్కోలు ఇలా కాదు’
హరారే: జింబాబ్వే జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జింబాబ్వే క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వ జోక్యం మితిమీరినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. సస్పెన్షన్ తక్షణం అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో జింబాబ్వేకి చెందిన క్రికెట్ జట్లు ఏవీ...ఇక ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి లేదు. అలాగే జింబాబ్వే క్రికెట్‌కు అందిస్తున్న నిధుల సాయాన్ని కూడా ఐసీసీ పూర్తిగా నిలిపివేసింది. ఐసీసీ నిర్ణయంతో జింబాబ్వేలో క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ నిర్ణయం పట్ల జింబాబ్వే క్రికెటర్లు సికందర్ రజా, బ్రెండన్ టైలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. ‘ఎలా ఒక నిర్ణయం ఉన్నట్లుండి మమ్మల్ని అపరిచితులుగా, నిరుద్యోగులుగా మారుస్తూ, ఎంతో మంది కెరియర్ని ముగిస్తుంది.. ఎలా ఒక నిర్ణయం ఎన్నో కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది.. అంతర్జాతీయ క్రికెట్‌కు నేను వీడ్కోలు చెప్పాలనుకున్న పద్దతి ఇది కాదు కదా’ అంటూ సికిందర్ రజా ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. How one decision has made a team , strangers How one decision has made so many people unemployed How one decision effect so many families How one decision has ended so many careers Certainly not how I wanted to say goodbye to international cricket. @ICC pic.twitter.com/lEW02Qakwx — Sikandar Raza (@SRazaB24) July 18, 2019 ‘జింబాబ్వేను సస్పెండ్ చేస్తూ.. ఐసీసీ తీసుకున్న నిర్ణయం హృదయవిదారకమైనది. మా చైర్మన్ ఎంపీ కాదు.. మా జట్టు వెనక ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. వందలాది మంది నిజాయతీ పరులైన ఆటగాళ్లు, ఉద్యోగులు, సహాయక సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ దీన్నో ఉద్యోగంలా మాత్రమే కాక బాధ్యతగా భావించి జింబాబ్వే క్రికెట్‌కు అంకితమయ్యారు’ అంటూ బ్రెండన్ టేలర్ ట్వీట్ చేశారు. @ICC It's heartbreaking to hear your verdict and suspend cricket in Zimbabwe. The @ZimbabweSrc has no government back round yet our Chairman is an MP? Hundreds of honest people,players, support staff,ground staff totally devoted to ZC out of a job,just like that. 💔 — Brendan Taylor (@BrendanTaylor86) July 18, 2019 -
క్రికెట్ చరిత్రలో మళ్లీ ఇలా జరగదేమో..!
-
క్రికెట్ చరిత్రలో మళ్లీ ఇలా జరగదేమో..!
షార్జా: క్రికెట్ చరిత్రలో కొన్నిసార్లు అరుదైన సంఘటనలు అవిష్కృతమవుతాయి. మళ్లీ అలాంటి ఫీట్లు జరిగే అవకాశం ఉండకపోవచ్చునని క్రికెట్ విశ్లేషకులు సైతం అఫ్గానిస్తాన్, జింబాబ్వే వన్డే సిరీస్ గురించి అభిప్రాయపడుతున్నారు. ఓ వన్డేలో ఓడితే తర్వాతి వన్డేలో ప్రత్యర్థిపై రెండో జట్టు ప్రతీకారం తీర్చుకుంటుంది. అందులో భాగంగా ఆ మరుసటి వన్డేలో నమోదైన గణాంకాలు మాత్రం క్రికెట్ ప్రేమికులతో పాటు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. ఒకే సిరీస్ లో ఇలా జరిగినా.. వరుస వన్డేల్లో ఇలాంటి ఫీట్ కావడం కష్టమే. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.. తమ వన్డే క్రికెట్లో రికార్డు విజయాన్ని నమోదు చేసిన అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు మరుసటి వన్డేలో అదే ప్రత్యర్థి జింబాబ్వే చేతిలో అంతే పరుగుల తేడాతో దారుణంగా ఓటమి పాలైంది. రెండో వన్డేలో నెగ్గిన జింబాబ్వే తొలి వన్డే దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 1-1తో ఇరుజట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. జింబాబ్వే స్టార్ క్రికెటర్ బ్రెండన్ టేలర్ (125; 121 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత శతకంతో చెలరేగడంతో పాటు సికిందర్ రజా (92; 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లాడి 5 వికెట్లకు 333 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ జట్టు జింబాబ్వే బౌలర్లు గ్రేమ్ క్రీమర్ (4/41), చతారా (3/24)లు విజృంభించడంతో 30.1 ఓవర్లకు 179 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ జట్టులో రహ్మద్ షా (43), దౌలత్ జర్దాన్ (47 నాటౌట్) మాత్రమే ఆ జట్టు 154 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 5 వికెట్లకు 333 పరుగులు చేయగా, ప్రత్యర్థి జింబాబ్వే జట్టు 34.4 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. రెండో వన్డేలో అదే స్కోర్లు నమోదయ్యాయి. కానీ జట్లే మారాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కేవలం ఆలౌటైన జట్టు ఆడిన ఓవర్లలోనే వ్యత్యాసం తప్ప.. ఇతర అన్ని అంశాలు ఒకేలా రిపీట్ కావడం క్రికెట్ చరిత్రలోనే అరుదైనదిగా భావించవచ్చు. తొలి వన్డే: అఫ్గానిస్తాన్: 333/5 జింబాబ్వే: 179 ఆలౌట్ రెండో వన్డే: జింబాబ్వే: 333/5 అఫ్గానిస్తాన్: 179 ఆలౌట్ -
దక్కింది పన్నెండు వేలే!
ఇటీవల ముగిసిన క్రికెట్ ప్రపంచకప్‌లో తమ జట్టు ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్(29)ను ఎవరూ అంత ఈజీగా మరిచిపోలేరు. ఇండియాతో జరిగిన తన చివరి మ్యాచ్‌లో ఒక సూపర్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో టేలర్ జాతీయ జట్టునుంచి తప్పుకొన్నాడు. వయసును బట్టి చూసినా, బ్యాటింగ్ ఫామ్‌ను గమనించినా టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడం ఆశ్చర్యమే. అయితే, ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ క్లబ్లో ఒప్పందం కుదుర్చుకొని ఆ జట్టు తరఫున ఆడటానికి టేలర్ జింబాబ్వే జాతీయజట్టు నుంచి తప్పుకొన్నాడు. జాతీయ జట్టుకు ఆడటానికీ, ఒక క్లబ్‌కు ఆడటానికీ మధ్య ఎంత తేడా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. అయినా ఎందుకు అలా చేశాడంటే, ప్రపంచకప్‌లో జింబాబ్వే తరఫున ఆడినందుకుగానూ టేలర్‌కు దక్కిన మొత్తం 12,000 రూపాయలు మాత్రమే! ఈ డబ్బుతో ఎలా బతకాలో అర్థం కాక జాతీయ జట్టుకు వీడ్కోలు పలికానని టేలర్ ప్రకటించాడు! ఈ ఆటగాడు తన బ్యాటింగ్‌తో వినోదాన్ని పంచగలడు, జట్టును గెలిపించగలడు కాబట్టి టేలర్ తో ఇంగ్లండ్ క్లబ్ ఒప్పందం కుదుర్చుకొంది. దీంతో టేలర్ కు జింబాబ్వేతో పోల్చుకొంటే మంచి పారితోషికమే లభిస్తుంది. ఇలా జింబాబ్వే నుంచి ఇంగ్లండ్ తరలి వెళ్లిన ఆటగాళ్లలో టేలరే కాదు, సీన్ ఇర్విన్. , ముర్రే గుడ్విన్,, ఆండీ ఫ్లవర్ , ఆంటోనీ ఐర్లాండ్ వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు. గమనించదగ్గ అంశం ఏమిటంటే, వీళ్లంతా తెల్లజాతి వాళ్లే! -
వన్డే మ్యాచ్‌లకు టేలర్ గుడ్‌బై!
-
ఐర్లాండ్ సంచలనం
చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో ఐర్లాండ్ జట్టు సంచలన విజయాన్ని అందుకుంది. జింబాబ్వే బౌలర్లు పట్టు విడవకుండా పోరాడినా ఫలితం దక్కలేదు. సోమవారం సిల్హెట్ స్టేడియంలో జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఐర్లాండ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఈ మెగా టోర్నీలోని ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించేందుకు తమ మార్గాన్ని సుగమం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. బ్రెండన్ టేలర్ (46 బంతుల్లో 59; 6 ఫోర్లు; 2 సిక్స్), చిగుంబురా (13 బంతుల్లో 22 నాటౌట్; 2 సిక్స్) రాణించారు. 14 పరుగులకే తొలి వికెట్ పడగా ఓపెనర్ మసకద్జా (17 బంతుల్లో 21; 3 ఫోర్లు)తో కలిసి టేలర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వేగంగా ఆడిన టేలర్ 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో చిగుంబురా ధాటిగా ఆడి స్కోరును పెంచాడు. డాక్రెల్, మెక్ బ్రైన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 20వ ఓవర్ చివరి బంతికి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు స్టిర్లింగ్ (34 బంతుల్లో 60; 9 ఫోర్లు; 1 సిక్స్), పోర్టర్‌ఫీల్డ్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు; 1 సిక్స్) ధాటిగా ఆడారు. ఆరో ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాది స్టిర్లింగ్ జోరును ప్రదర్శించాడు. దీంతో 8.2 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 80 పరుగులు జత చేరాయి. స్టిర్లింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. చివర్లో ఉత్కంఠ అయితే రెండు వికెట్ల నష్టానికి వంద పరుగులతో పటిష్టంగానే కనిపించిన ఐర్లాండ్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి తడబడింది. పేసర్ పన్యంగరా (4/37) రెచ్చిపోవడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ ప్రారంభమైంది. 15వ ఓవర్లో తను రెండు వికెట్లు తీశాడు. అప్పటికి 30 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో బరిలోకి దిగిన కెవిన్ ఓబ్రియాన్ (10 బంతుల్లో 17; 2 ఫోర్లు; 1 సిక్స్) తన సహజశైలిలో ఆడగా 12 బంతుల్లో లక్ష్యం ఏడు పరుగులకు వచ్చింది. చివరి ఓవర్లో నాలుగు పరుగులు రావాల్సి ఉండగా రెండు బంతుల్లో రెండు వికెట్లు పడడంతో ఐర్లాండ్ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఇక చివరి బంతికి ఒక్క పరుగు అవసరం. బంతి బ్యాట్స్‌మన్‌కు చిక్కకుండా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నేరుగా వికెట్లను గిరాటేసేందుకు టేలర్ ప్రయత్నించి విఫలమయ్యాడు. విజయానికి కావాల్సిన సింగిల్‌ను ఐర్లాండ్ సాధించడంతో మ్యాచ్ ముగిసింది.