క్రికెట్‌కు హ్యారిస్ వీడ్కోలు
లండన్: యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా పేసర్ రియాన్ హ్యారిస్ సంచలన నిర్ణ యం తీసుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కోసం జట్టుతో పాటే ఉన్న ఈ 35 ఏళ్ల ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. మోకాలి గాయం తిరగబెట్టడంతో ఎసెక్స్‌తో జరిగిన చివరి వార్మప్ మ్యాచ్‌లో తను ఆడలేదు. స్కానిం గ్‌లో అతడి కుడి మోకాలు బాగా దెబ్బతిన్నట్టు తేలింది.
దీంతో ఇక క్రికెట్ నుంచి తప్పుకోవడమే మేలని భావించినట్టు హారిస్ తెలిపాడు. 2010లో అరంగేట్రం చేసిన తను 27 టెస్టుల్లో 113 వికెట్లు.. 21 వన్డేల్లో 44 వికెట్లు తీశాడు. హ్యారిస్ నిర్ణయంతో జట్టులోకి 22 ఏళ్ల పాట్ కమిన్స్‌ను తీసుకున్నారు. బుధవారం నుంచి తొలి టెస్టు జరుగుతుంది.