శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ దిల్రువాన్ పెరీరా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పెరీరా రిటైర్మెంట్ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ద్రువీకరించింది. "శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిల్రువాన్ పెరీరా, అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు" అని శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన పెరీరా.. దేశవాళీ క్రికెట్‌లో కొనసాగనున్నాడు. ఇప్పటి వరకు శ్రీలంక తరుపున 43 టెస్టు మ్యాచ్‌లు ఆడిన దిల్రువాన్ పెరీరా 161 వికెట్లు తీశాడు.
కాగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు, హాఫ్ సెంచరీ చేసిన ఏకైక శ్రీలంక ఆటగాడిగా దిల్రువాన్ పెరీరా అరుదైన ఘనత సాధించాడు. అదే విధంగా 13 వన్డేలు, 3 టీ20లు ఆడిన దిల్రువాన్.. వరుసగా 13, 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే 200కు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 800 వికెట్లు తీశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక తరుపున దిల్రువాన్ ఆరంగట్రేం చేశాడు.
చదవండి: IPL 2022: 'ఐపీఎల్‌లో ఆ జట్టుకు ఆడాలని ఉంది.. అతడే నా ఫేవరెట్ కెప్టెన్'
Comments
Please login to add a commentAdd a comment