Dilruwan Perera
-
అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ఆల్ రౌండర్ గుడ్‌బై..
శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ దిల్రువాన్ పెరీరా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పెరీరా రిటైర్మెంట్ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ద్రువీకరించింది. "శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిల్రువాన్ పెరీరా, అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు" అని శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన పెరీరా.. దేశవాళీ క్రికెట్లో కొనసాగనున్నాడు. ఇప్పటి వరకు శ్రీలంక తరుపున 43 టెస్టు మ్యాచ్‌లు ఆడిన దిల్రువాన్ పెరీరా 161 వికెట్లు తీశాడు. కాగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు, హాఫ్ సెంచరీ చేసిన ఏకైక శ్రీలంక ఆటగాడిగా దిల్రువాన్ పెరీరా అరుదైన ఘనత సాధించాడు. అదే విధంగా 13 వన్డేలు, 3 టీ20లు ఆడిన దిల్రువాన్.. వరుసగా 13, 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే 200కు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 800 వికెట్లు తీశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక తరుపున దిల్రువాన్ ఆరంగట్రేం చేశాడు. చదవండి: IPL 2022: 'ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది.. అతడే నా ఫేవరెట్ కెప్టెన్' -
భారత్‌తో మూడో టెస్టు: పెరీరా 'సెంచరీ'
ఢిల్లీ:శ్రీలంకతో ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఆరంభమైన చివరిదైన మూడో టెస్టులో భారత్ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్‌ను శిఖర్ ధావన్, మురళీ విజయ్‌లు ప్రారంభించారు. అయితే ఇన్నింగ్స్ పదో ఓవర్లోనే భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్(23) మొదటి వికెట్ గా పెవిలియన్ చేరాడు. లంక స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా బౌలింగ్‌లో లక్మల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పెరీరా వేసిన ఆఫ్ బ్రేక్‌కు తడబడిన ధావన్.. డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లక్మల్‌కు క్యాచ్ ఇచ్చాడు. కాగా, ఇది పెరీరాకు వంద టెస్టు వికెట్ కావడం ఇక్కడ విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో ఆడని శిఖర్ ధావన్ తిరిగి జట్టులో చేరగా, పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో మొహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చాడు. -
స్మిత్ లాగే... పెరీరా!
ఇటీవలే భారత్ పర్యటనలో ఆసీస్ కెప్టెన్ స్మిత్ మాదిరిగానే శ్రీలంక బ్యాట్స్‌మన్ దిల్రువాన్ పెరీరా కూడా డీఆర్ఎస్ కోసం పెవిలియన్‌ను ఆశ్రయించాడు. అయితే కోహ్లి సేన నుంచి అభ్యంతరం లేకపోవడంతో మొత్తానికి ఇదేమంత వివాదం కాలేదు. షమీ వేసిన 57వ ఓవర్ చివరి బంతికి పెరీరా ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో హెరాత్‌ను సంప్రదిస్తూనే వెనుదిరిగాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూసి ఉన్నపళంగా ఆగి... రివ్యూ కోరడం చర్చనీయాంశమైంది. రీప్లేలో నాటౌట్‌గా తేలడంతో అతను ఓ 5 పరుగులు చేసేశాడు. ఈ ఘటనతో డీఆర్ఎస్ మళ్లీ డ్రెస్సింగ్ రూమ్ సమీక్షా పద్ధతైంది! చూశాడేమో కానీ... తమ ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూశాడేమో కానీ... రివ్యూపై సాయం కోరలేదని, సంజ్ఞలేవీ చేయలేదని లంక బోర్డు (ఎస్ఎల్సీ) వివరణ ఇచ్చింది. ఆసీస్ కెప్టెన్ స్మిత్ -
'దిల్రువాన్ సైలెంట్ హీరో'
గాలె: ఆఫ్ స్పిన్నర్ దిల్రువాన్ పెరీరాను శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 'సైలెంట్ హీరో'గా వర్ణించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పెరీరా పది వికెట్లు తీయడంతో పాటు అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టుల్లో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ గా నిలిచాడు. 11 టెస్టుల్లోనే అతడు ఈ ఫీట్ సాధించాడు. అజంతా మెండిస్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మెండిస్ 12 టెస్టుల్లో 50 వికెట్లు తీశాడు. 'రంగనా హిరాత్ గురించి మేమంతా ఎక్కువగా మాట్లాడుతున్నాం. దిల్రువాన్ గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ అతడు వేగంగా 50 టెస్టు వికెట్లు సాధించాడు. అతడు నినాదంగా తన పని తాను చేశాడు. దిల్రువాన్ సైలెంట్ హీరో. గత మ్యాచ్ లో బౌలింగ్ చేసే అవకాశం అతడికి ఇవ్వలేదు. అతడు చురుకైన బౌలర్. గాలె మైదానంలో ఎలా బౌలింగ్ చేయాలో దిల్రువాన్ కు తెలుసు. శిక్షణా శిబిరంలో చాలా కష్టపడతాడు. రాబోయే రోజుల్లో అతడి బౌలింగ్ ను సమర్థవంతంగా వినియోగించుకుంటామ'ని మ్యాచ్ ముగిసిన తర్వాత మాథ్యూస్ అన్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక మరో టెస్టు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. మూడో టెస్టు 13 నుంచి జరుగుతుంది.